కొన్ని గ్రామాల్లో ప్రజలు వింత ఆచారాలు, సంప్రదాయాలను ఆచరిస్తూ ఉంటారు.వినడానికి ఇవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి.
తాజాగా ఏపీలోని ఒక గ్రామంలో ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు.అదేంటంటే.
ఆ గ్రామంలోని ప్రజలు కాళ్లకు చెప్పులు అసలు వేసుకోరు.తిరుపతి జిల్లాలోని( Tirupati ) పాకాల మండలంలోని వేమనగారి గాండ్లు( Vemanagar Gandlu ) అనే గ్రామంలోని ప్రజలు ఈ వింత సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
పాకాల మండలం నుంచి పది కిలోమీటర్ల దూరంలో వేమనగారి ఇండ్లు అనే గ్రామం ఉంటుంది.ఇది చాలా చిన్న గ్రామం.

ఈ ఊరిలో ఉన్నవాళ్లు ఎవరూ కూడా చెప్పులు వేసుకోరు.అంతేకాదు బయటివాళ్లు ఎవరైనా ఈ ఊరికి వెళ్లినా సరే చెప్పులు వేసుకోకుండా తిరగాలి.అనాధిగా ఈ గ్రామంలో ఆ ఆచారం నడుస్తోంది.ఈ వింత ఆచారం వల్ల ఆ గ్రామానికి ఎవరూ వెళ్లడం లేదు.దీంతో ఆ గ్రామ జనాభా కూడా పెరగడం లేదు.ఈ గ్రామంలో పాల్వెక్రి కమ్యూనిటీకి ( Palvekri community )చెందినవారు ఉన్నారు.
వాళ్లు తమకు తాము దొరవర్లుగా ప్రకటించుకున్నారు.అంతేకాకుండా ఈ ఊరిలోని ప్రజలు వేరే గ్రామాల్లోని గుడుల్లో పూజలు చేయరు.
తమ విలేజ్ లో ఉన్న చిన్న ఆలయంలో మాత్రమే పూజలు చేస్తారు.

అలాగే ఈ ఊరి ప్రజలకు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ కి కూడా వెళ్లరట.ఊర్లోనే ఉన్న మర్రిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే రోగాలు నయమవుతాయని నమ్ముతారు.దీంతో హాస్పిటల్ కి వెళ్లకపోవడం వల్ల చాలామంది మృతి చెందారు.
ఆచారాల వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నా సరే.ఈ గ్రామ ప్రజలు తమ కట్టుబాట్లను అనుసరిస్తూనే ఉన్నారు.దీంతో ఈ గ్రామ జనాధా రోజురోజుకి తగ్గిపోతూనే ఉంటుంది.అలాగే ఈ గ్రామంలోని వారిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.దీంతో చాలామంది బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు.







