ది కాశ్మీర్ ఫైల్స్ ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ‘‘ది వ్యాక్సిన్ వార్( The Vaccine War )’’ చిత్రంపై భారతీయ అమెరికన్లు ప్రశంసల వర్షం కురిపించారు.1.4 బిలియన్ల జనాభా కలిగిన దేశం కోవిడ్ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కోవడంలో సహాయం చేసిన భారతీయ శాస్త్రవేత్తలు, ప్రత్యేకించి మహిళలు సాధించిన విజయాలకు ఇది నిదర్శనమన్నారు.ప్రస్తుతం ‘ఇండియా ఫర్ హ్యూమానిటీ టూర్, యూఎస్ఏ’లో వున్న అగ్నిహోత్రి( Vivek Ranjan Agnihotri ).వాషింగ్టన్ డీసీలోని మేరీల్యాండ్ సబర్బ్‌లో భారతీయ అమెరికన్లతో పాటు ఎంపిక చేసిన ప్రేక్షకులకు తన చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.ఆయన వెంట ప్రముఖ నటి, నిర్మాత పల్లవి జోషి కూడా వున్నారు.
భారతీయ శాస్త్రవేత్తలు విపత్కర పరిస్ధితులలో కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను విజయవంతంగా అభివృద్ధి చేశారు.ఈ నేపథ్యంలో కొందరు విదేశీయుల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్న దానిపై ‘‘ ది వ్యాక్సిన్ వార్’’ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సందర్భంగా అమెరికాలో స్థిరపడి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త జ్యోతా ఈ సినిమాను వీక్షించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ.ది వ్యాక్సిన్ వార్ అన్నింటినీ కళ్లకు కట్టినట్లు చూపించిందన్నారు.భారతీయ శాస్త్రవేత్తల కృషికి తాను అభినందిస్తున్నట్లు చెప్పారు.వ్యాక్సిన్ కోసం శ్రమించిన తాము (మహిళా శాస్త్రవేత్తలు) ప్రశంసించబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.శాస్త్రవేత్తలు ఆరోగ్య సంరక్షణకు వెన్నెముకలా వుంటారని.
తాము ఆసుపత్రి నేలమాళిగలో, దాని వెనుక భాగంలో పనిచేస్తామని జ్యోతా చెప్పారు.తాము అక్కడ ఏం పని చేస్తున్నామో ప్రజలకు తెలియదని.
అందువల్ల ప్రశంసల దక్కవన్నారు.

కాగా.స్థానిక (అమెరికా) నిర్వాహకులు తొలుత ఓ థియేటర్‌లో సినిమాను ప్రైవేట్‌గా ప్రదర్శించాలని ప్లాన్ చేశారు.అయితే అక్కడి ఇండో అమెరికన్ల నుంచి డిమాండ్ నేపథ్యంలో రెండు థియేటర్లలో ది వ్యాక్సిన్ వార్ సినిమాను ప్రదర్శించారు.
రెండు థియేటర్లు హౌస్‌ఫుల్ అవ్వగా.వివేక, పల్లవిలకు ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్స్ ఇచ్చి గౌరవించారు.
సినిమా చూసిన అనంతరం ఎన్ఆర్ఐలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.ఇకపోతే.
ది వ్యాక్సిన్ వార్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.నానాపటేకర్, పల్లవీ జోషి, రైమాసేన్, అనుపమ్ ఖేర్( Anupam Kher ) , సప్తమి గౌడ, దివ్యసేథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మాణంలో భాగం కాగా.ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదికి పైగా భాషల్లో రిలీజ్ కానుంది.







