కమల్ హాసన్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొని అనంతరం ఇండస్ట్రీలో సక్సెస్ సాధించినటువంటి శృతిహాసన్( Shrithi Hassan ) గురించి చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్ గా తనని తాను మెరుగుపరుచుకుంటూ స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు.
అయితే తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తిరిగి క్రాక్ ( Crack )సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఇక ఈ సినిమా తరువాత శృతిహాసన్ వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక త్వరలోనే ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటించిన సలార్ సినిమా( Salar Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో హోం భలే ఫిలిమ్స్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం సలార్ ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ఏకంగా ఐదు భాషలలో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
వచ్చేనెల తొలి వారంలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇకపోతే ఈ సినిమా వచ్చేనెల 28న విడుదల కానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా శృతిహాసన్ సైతం డబ్బింగ్( Dubbing ) పనులను పూర్తి చేస్తున్నారు.ఇక ఈ సినిమా ఐదు భాషలలో విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఐదు భాషలలో కూడా శృతిహాసన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పే పనులలో బిజీ అయ్యారు.
ఇప్పటికే ఈమె మూడు భాషలలో తన పాత్రకు డబ్బింగ్ పనులను పూర్తి చేశారని, మరో రెండు భాషలలో ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టారని తెలుస్తోంది.ఇలా ఐదు భాషలలో డబ్బింగ్ చెబుతున్న విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఇక ఇందులో ఈమె ఆధ్య అనే పాత్రలో నటించబోతున్నారు.ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోల సరసన నటించిన శృతిహాసన్ మొదటి సారి ప్రభాస్ సరసన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.







