భారత్, అమెరికా( India, America ) మధ్య ఎప్పటికీ స్నేహపూర్వక సంబంధాలు ఉంటాయి.రెండు మిత్ర దేశాలుగా ఎప్పటినుంచో కొనసాగుతున్నాయి.
ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఒకరినొకరు సహాయం చేసుకోవడంలో రెండు దేశాలు మంచి స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తున్నాయి.ఇక చైనాతో అమెరికా, భారత్‌లు దూరం పాటిస్తున్నాయి.
రెండు దేశాలకు చైనా శత్రువుగా మారిపోయింది.చైనా, అమెరికా మధ్య ఆర్ధిక విషయాల్లో విబేధాలు కొనసాగుతుండగా.
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు జరుగుతున్నాయి.

అయితే తాజాగా రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) కీలక వ్యాఖ్యలు చేశారు.చైనా వద్దని, భారత్ తో బంధమే అమెరికాకు మంచిదని ఆయన స్పష్టం చేశారు.కమ్యూనిస్టు చైనాపై మనం ఆధారపడకూడదంటే భారత్ తో స్నేహం చేయాలని సూచించారు.
డ్రాగన్ దేశాన్ని అడ్డుకోవాలంటే భారత్ తో సైనిక సంబంధాలు బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.వివేక్ వెంకటస్వామి 2014లో రాయివంట్ సైన్సెస్‌ను( Ryvant Sciences ) స్థాపించగా.2015,2016లో అతిపెద్ద బయోటెక్ ఐపీవోను( Biotech IPO ) నడిపించారు.తన కంపెనీని అగ్రస్థానానికి చేర్చిన వివేక్ వెంకటస్వామి( Vivek Venkataswamy ).తన కంపెనీ ఉత్పత్తులకు ఎప్డీఏ అనుమతులు కూడా సాధించాడరు.

అమెరికా అధ్యక్ష పదవికి ప్రస్తుతం వివేక్ వెంకటస్వామి పోటీ పడుతున్నారు.రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వంలో డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) తర్వాత వివేక్ రెండో స్థానంలో ఉన్నారు.ఇప్పటికే అనేక అవసరాల కోసం చైనాపై అమెరికా ఆధారపడుతుందని, దాని కంటే భారత్ పై ఆధారపడటం మంచిదని సూచించారు.
అండమాన్ సముద్ర జలాల దగ్గర భారత్ తో సైనిక బంధం అవసరమని, దీని వల్ల మలక్కా జల సంధి వద్ద చైనా నౌకలను అడ్డుకోవచ్చని తెలిపారు.భారత్ కు నరేంద్ర మోదీ సరైన నాయకుడని ఆయన కితాబిచ్చారు.
అలాగే ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్దంలో అమెరికా కలగజేసుకోవడం పెద్ద తప్పు అని, దీని వల్ల అంతర్జాతీయంగా అమెరికా క్రెడిబిలిటీ దెబ్బ తింటుందని తెలిపారు.







