బెల్లంకొండ శ్రీనివాస్ హీరో గా హిందీ, తెలుగు రెండు భాషలలో వచ్చిన ఛత్రపతి సినిమా( Chatrapathi Movie ) ప్లాప్ అయినా విషయం మనకు తెలిసిందే.నిజానికి ఈ సినిమాతో శ్రీనివాస్ బాలీవుడ్ లో తను ఒక స్టార్ హీరో గా వెలిగిపోవచ్చు అని చాలా కలలుకన్నాడు.కానీ చివరికి బాలీవుడ్ జనాలు ఆ సినిమా ను డిజాస్టర్ చేశారు ఇక దానితో ప్రస్తుతం ఏం సినిమా చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈయన హీరో గా వచ్చిన చాలా సినిమాలు తెలుగులో ప్లాప్ అవుతున్న విషయం మనకు తెలిసిందే కానీ ఈయన మాత్రం బాలీవుడ్( Bollywood ) లో జెండా పాతుదాం అని అనుకున్నాడు…

అయితే తెలుగులో మంచి సినిమాలు తీసిన టాప్ డైరెక్టర్లతో( Top Directors ) ఈయన ఇప్పటికే సినిమాలు చేసినప్పటికీ ఈయనకి పెద్ద హిట్లు అయితే రాలేదనే చెప్పాలి.అందుకే బెల్లంకొండ( Bellamkonda Srinivas ) అంటే పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోయిన్లు అందరూ ఉంటారు కానీ కథ మాత్రం ఉండదు ఆయన యాక్టింగ్ కూడా చేయరు అనే టాక్ ఇండస్ట్రీ లో చాలా బాగా వైరల్ అయింది.ఇక ఈయన నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే విషయం మీద చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి… అయితే రీసెంట్ గా హిట్ కొట్టిన ఒక యంగ్ డైరెక్టర్( Young Director ) తో తన నెక్స్ట్ సినిమా ఉంటుంది అని తెలుస్తుంది ఆయన ఎవరు అనేది పేరు ఇంకా బయట పెట్టడం లేదు…నిజానికి ఈయనతో సినిమాలు తీసిన చాలా మంది డైరెక్టర్లు కూడా అంతకు ముందు మంచి హిట్లు ఉన్న డైరెక్టర్లు కావడం విశేషం…

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు లో మంచి హిట్ కొట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే రాక్షసుడు సినిమా మాత్రమే ఇది ఒక తమిళ్ రీమేక్ సినిమా( Tamil Remake Movie ) ఇక అందుకే చాలా మంది సినీ అభిమానులు సైతం ఆయన మళ్ళీ రీమేక్ సినిమా చేస్తేనే బాగుంటుంది అలాంటి సినిమాలు అయితేనే ఆయన హిట్ కొట్టగలరు ఇక అలాంటి సినిమాలే అధ్యాంతం ఉత్కంఠ ని నెలకొల్పుతూ చివరి వరకు సస్పెన్స్ గా సాగుతూ ఉంటాయి అని వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి సినిమాలు చేస్తారో వేచి చూడాలి…








