సరిహద్దుల గేట్లను తెరిచిన ఉత్తర కొరియా... ఇక షురూ చేయుర్రి!

విదేశాలలో ఉన్న తమ పౌరులు స్వదేశానికి తిరిగి రావడానికి అనుమతిస్తామని ఉత్తర కొరియా( North Korea ) ఈ ఆదివారం చల్లని కబురు తెలియజేసింది.దాంతో ప్రపంచం వ్యాప్తంగా వున్న అనేకమంది కొరియన్లు తమ సొంత దేశానికి వెళ్లే పనిలో పడ్డారు.

 North Korea Lets Citizens Abroad Return In Easing Of Covid Isolation Details, No-TeluguStop.com

కోవిడ్( Covid ) తరువాత ప్రపంచ దేశాల పరిస్థితి ఎలా వుందో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇపుడు చాలా దేశాలు నెమ్మదిగా తన కఠినమైన కరోనా వైరస్ పరిమితులను సడలిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఉత్తర కొరియా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇకపోతే, మహమ్మారి కారణంగా చాలామంది ఉత్తర కొరియా విద్యార్థులు( North Korea Students ) ఎక్కువగా చైనా మరియు రష్యాలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దేశానికి విదేశీ ఆదాయానికి కార్మికులు కీలక వనరులు అన్న సంగతి విదితమే.మహమ్మారి ప్రారంభమైన తర్వాత ఉత్తర కొరియా పర్యాటకులను చాలా స్ట్రిక్ట్ గా నిషేధించింది.అదేవిధంగా దౌత్యవేత్తలను బయటకు పంపింది.సరిహద్దు ట్రాఫిక్ మరియు వాణిజ్యాన్ని తీవ్రంగా తగ్గించింది.

ఈ క్రమంలోనే లాక్‌డౌన్( Lock Down ) ఉత్తర కొరియా దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులను మరియు ఆహార అభద్రతను మరింత దిగజార్చింది.

Telugu Gates, China, Corona, Covid, Kim Jong, Latest, Korea, Korea Borders, Kore

కాగా 3 సంవత్సరాల తర్వాత మొదటి ఉత్తర కొరియా వాణిజ్య జెట్ బీజింగ్‌లో దిగింది.విమానం తర్వాత రోజు బీజింగ్( Beijing ) నుండి తిరిగి వచ్చింది, కానీ అందులో ఎవరు ఉన్నారో ప్రస్తుతం తెలియడం లేదు.అంతకుముందు ఆగస్టులో, ఉత్తర కొరియా టైక్వాండో అథ్లెట్లు మరియు అధికారుల బృందం బీజింగ్‌కు భూమి మార్గంలో ప్రయాణించి, అంతర్జాతీయ పోటీలో పాల్గొనడానికి కజకిస్తాన్‌కు( Kazakhstan ) విమానంలో వెళ్లినట్టు అక్కడి మీడియాలు కధనాలు వెలువరించాయి.

Telugu Gates, China, Corona, Covid, Kim Jong, Latest, Korea, Korea Borders, Kore

మహమ్మారి ప్రారంభమైన తర్వాత ఉత్తర కొరియా నుండి ఇంత పెద్ద ప్రతినిధి బృందం అంతర్జాతీయ పర్యటన చేయడం ఇదే తొలిసారి కావడం కొసమెరుపు.ప్రైవేట్ సెజోంగ్ ఇన్స్టిట్యూట్‌లోని విశ్లేషకుడు చియోంగ్ సియోంగ్-చాంగ్( Seong-Chang CHEONG ) మాట్లాడుతూ విదేశాల నుండి కార్మికులు తిరిగి రావడం అంటే ఉత్తర కొరియాకు అరుదైన విదేశీ కరెన్సీని కోల్పోతుందని, కాబట్టి చైనా మరియు రష్యాలో వారి స్థానంలో ఇతర కార్మికులను పంపడానికి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే అవకాశముందని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube