భారతదేశపు సంస్కృతీ సంప్రదాయాలలో ఆహారానికి( Food ) పెద్ద పీట వేయడం జరిగింది.మనదేశంలో దొరికినన్ని వివిధ రకాల ఆహార పదార్ధాలు మరే దేశంలో కూడా మనకి కనబడవు.
మరీ ముఖ్యంగా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ (వీధి ఆహారం)( Street Food ) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఇక్కడ దొరికినన్ని వెరైటీలు మరెక్కడా మనకి కనిపించవనే చెప్పుకోవాలి.
పకోడా, బజ్జీలు, జిలేబీ, పానీపూరీ, మసాలా పూరీ, దహీ పూరీ ఇలా అనేక రకాల వెరైటీలు మనదగ్గర కోకొల్లలుగా కనబడతాయి.స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ మందిని ఆకర్షించడానికి ప్రత్యేక కారణం వుంది.
ఫైవ్‌స్టార్ హోటల్‌లో కూడా దొరకని టేస్ట్ మన స్ట్రీట్ ఫుడ్ లో దొరుకుతుంది.

అందుకే ఇక్కడ పానీపూరీ, మసాలాపూరీలను స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా అమ్ముతూ వుంటారు.ఇంకా వాటికి భారీ డిమాండ్ అనేది ఉంటుంది.అయితే స్ట్రీట్ ఫుడ్ ప్రియులకు ఇపుడు ఓ చేదువార్త.
టేస్ట్అట్లాస్( Taste Atlas ) మనదేశంలో టాప్ 10 చెత్త ఫుడ్ లిస్ట్ తీసింది.ఆ లిస్టులో మీరు ఎంతగానో ఇష్టపడే చాలా స్ట్రీట్ ఫుడ్స్‌ను చేర్చింది! టేస్ట్అట్లాస్ అనేది ఒక ట్రావెల్ గైడ్.
ఇది వంటకాలు, ఆహార సమీక్షలు మరియు మరిన్నింటితో సహా ఆహారానికి సంబంధించిన అనేక సమాచారాన్ని అందిస్తుంది.ఆ లిస్ట్ చూస్తే మీరు ఖచ్చితంగా దానిని వ్యతిరేకిస్తారు.మరెందుకాలస్యం… చెత్త స్ట్రీట్ ఫుడ్స్ లిస్ట్ ఇక్కడ చూసేయండి మరి!

మీలో దహీపురి( Dahipuri ) అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి.కష్టం కదూ.మనందరికీ అదంటే మక్కువ ఎక్కువే.అయితే టాప్ 1 చెత్త స్ట్రీట్ ఫుడ్ లో ఇదే వుంది మరి.మరి మీరు దీనిని ఏకీభవిస్తారా? ఇక టాప్ 2 లో “సేవ్ పూరి”( Sevpuri ) వుంది.సేవ్ పూరి అంటే తెలుసు కదా.సన్నటి మిక్చర్, మసాలా, పెరుగుతో మనం ఆరగిస్తాం.అలాగే టాప్ 3 విషయానికొస్తే “దబేలి”( Dabeli ) వుంది.
ఇది ఎక్కువగా గుజరాత్ స్త్రీట్స్ లో ఎక్కువగా దొరుకుతుంది.ఇది కూడా చెత్త ఆహార జాబితాలో ఉంది.
అదేవిధంగా టాప్ 4లో బాంబే శాండ్‌విచ్, టాప్ 5లో ఎగ్ బుర్జి, టాప్ 6లో దహీ వడ, టాప్ 7 విషయానికొస్తే సాబుదాన వడ, టాప్ 8 పోప్రి చాట్, టాప్ 9 గోబీ పరోటా, టాప్ 10లో పకోడా వుంది.పకోడి గురించి మీరు అస్సలు ఊహించి వుండరు కదూ.ఇది కూడా చెత్త ఫుడ్డేనట.మరి మీరు మీరు ఏమంటారు?
.






