తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన సక్సెస్ అయినా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.వాళ్లందరికీ మెగాస్టార్ చిరంజీవే( Chiranjeevi ) స్ఫూర్తి అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.
ఆయనని ఆదర్శంగా తీసుకొని తెలుగు సినిమా కి ఆకర్షితులై ఎంతో మంది హీరోలు వచ్చారు.కొంతమంది అదృష్టం కలిసొచ్చి స్టార్స్ అయ్యారు , కొంతమందికి అదృష్టం కలిసిరాక మధ్యలోనే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయారు.
అలాంటి హీరోలలో ఒకరు ఉదయ్ కిరణ్.( Uday Kiran ) ఇతను ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.
మొదటి సినిమా ‘చిత్రం’ పెద్ద బ్లాక్ బస్టర్, ఆ తర్వాత వచ్చిన ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ వంటి సినిమాలు కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.అలా మొదటి మూడు సినిమాలతోనే ఇండస్ట్రీ ని ఊపేసిన ఉదయ్ కిరణ్ కి టాలీవుడ్ లో అవకాశాల వెల్లువ కురిసింది.

కానీ అదే సక్సెస్ స్ట్రీక్ ని ముందుకు కొనసాగించలేకపోయాడు ఉదయ్ కిరణ్, వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తూ చూస్తుండగానే ఎంత ఎత్తుకి ఎదిగాడో, అంత పాతాళంలోకి పడిపోయాడు.దీంతో ఉదయకిరణ్ తో సినిమాలు చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రాలేకపోయారు.ఆ సమయం లో ఇండస్ట్రీ నన్ను దూరం పెట్టేసింది అని ఉదయ్ కిరణ్ ఎంతో మనస్తాపానికి గురయ్యాడు.మధ్య మధ్యలో హీరోల పక్కన సైడ్ క్యారెక్టర్స్ ఆఫర్స్ వచ్చాయి.
కానీ ఉదయకిరణ్ చెయ్యడానికి ఇష్టపడలేదు.చివరికి ఆర్థికంగా కూడా బాగా నష్టపోయిన ఉదయ్ కిరణ్ చేసేదేమి లేక ఆత్మహత్య చేసుకొని చనిపోవడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.
ఇదంతా పక్కన పెడితే ఉదయ్ కిరణ్ గురించి ఎవరికీ తెలియని ఒక షాకింగ్ నిజం బయటపడింది, ఆయనకీ పర్ణిక మాన్య(Parnika Manya ) అనే ఒక చెల్లెలు ఉంది.చెల్లెలు అంటే ఉదయకిరణ్ అమ్మ చెల్లికి కూతురు అన్నమాట.

ఉదయకిరణ్ ఈమెని చిన్నప్పటి నుండి తన అక్కతో సమానంగా ప్రేమించాడు, ఆమెకి ఏమి కోరిక కావాలన్నా తీర్చేవాడు.సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి కూడా పర్ణిక కి ఎంతో సహాయం పడ్డాడు.ఇప్పుడు పర్ణిక టాలీవుడ్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న సింగర్ గా కొనసాగుతుంది.ఈమె పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరో గా నటించిన ‘భీమ్లా నాయక్’( Bheemla Nayak ) సినిమాలో పాటలు పాడింది.
అంతకు ముందు బాహుబలి లో కూడా కొన్ని పాటలు పాడింది.ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ సింగర్ గా కొనసాగుతుంది.ఇకపోతే ఈమె పాడిన ‘అయిగిరి నందిని’ అనే భక్తి పాట ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే, ఇలాంటి భక్తి పాటలు కూడా ఇది వరకు ఆమె ఎన్నో పాడింది.







