మెదక్ జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.మాసాయిపేట మండలం తిమ్మాయిపల్లిలో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే చిరుత పులి చేసిన దాడిలో లేగ దూడ మృతిచెందింది.చిరుత దాడి నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చిరుత సంచరించిన ప్రాంతాన్ని సందర్శించి పాదముద్రలను సేకరించే పనిలో పడ్డారు.
చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.







