ఒళ్లు గగుర్పొడిచే సీన్.. ఫొటోకు కాపలాగా ఉన్న పాము.. ఎప్పటినుంచంటే..?

మన ఇంట్లో అందంగా ఉండేందుకు చాలామంది రకరకాల ఫొటోలను పెట్టుకుంటూ ఉంటాం.అందంగా కనిపించాలని ఇంటిని వివిధ రకాల డిజైన్లతో డెకరేట్ చేసుకుంటూ ఉంటారు.

 A Tear-jerking Scene.. The Snake Guarding The Photo.. As Always..? Viral News,-TeluguStop.com

ఇంట్లో మొక్కలు, పూలతో పాటు అందమైన పెయింటింగ్‌లను గోడకు ఏర్పాటు చేసుకుంటారు.అలాగే వివిధ ఫంక్షన్లలోని ఫొటోలను కూడా ఫ్రేమ్‌గా తయారుచేయించుకుని గోడకు వేలాడదీస్తూ ఉంటారు.

అలాగే కొంతమంది ఖరీదైన పెయింటింగ్స్‌ను ఇంట్లో పెట్టుకుంటారు.

అయితే ఒక ఫొటోకు పాము కాపలాగా ఉన్న సంఘటన చూసి అందరూ షాక్ అవుతున్నారు.సినిమాల్లో ఇలాంటి సంఘటనలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.కానీ అలాంటిది రియల్ లైఫ్‌లో జరిగితే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఆస్ట్రేలియా( Australia )లోని ఒక ఇంటి యజమానికి ఇలాంటి భయంకరమైన సంఘటన ఎదురైంది.అతడు ఇంట్లోని గోడకు తనకు ఇష్టమైన ఒక ఫొటోఫ్రేమ్‌ను వేలాడదీశాడు.

అయితే ఆ ఫొటోఫ్రేమ్ వెనుకాల ఒక కొండచిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు.ఆ భారీ పాముని చూసి అతడికి గుండె ఆగినంత పనైంది.

కొండ చిలువ( Python )ను చూసి భయానికి గురైన ఇంటి యజమాని వెంటనే పాములను పట్టుకునేవారికి సమాచారం అందించాడు.దీంతో వాళ్లు వచ్చి కొండచిలువను పట్టుకుని తీసుకెళ్లిపోవడంతో ఇంటి యజమాని ఊపిరిపీల్చుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.ఈ వీడియో చాలా భయాంనకంగా ఉంది.ఈ వీడియోను చూసినవారు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.కొండచిలువకు కూడా ఫొటోఫ్రేమ్ నచ్చిందేమో అని కొంతమంది ఫన్నీగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ఫొటోఫ్రేమ్‌కు చంద్రముఖి లాంటి చరిత్ర ఉందేమో అని మరికొందరు అంటున్నారు.చంద్రముఖి సినిమాలో ఒక పాము చంద్రముఖి రూపంలో ఉంటుంది.

ఇది చూస్తే అలాగే అనిపిస్తుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఏది ఏమైనా ఈ విషయం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఇంట్లోకి అసలు కొండచిలువ ఎలా వచ్చిందని కొంతమంది అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube