సరైనోడు లాంటి హిట్ రామ్ కు వస్తుందా.. 'స్కంద' ఎలా ఉండబోతుంది?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ( Ram Pothineni ) మాస్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కొద్దో గొప్పో సంపాదించుకున్న అది సరిపోవడం లేదు.

 Ram Pothineni Boyapati's Skanda Movie, Ram Pothineni, Boyapati Srinu, Sreeleela-TeluguStop.com

ఆ తర్వాత మరింత మాస్ ఇమేజ్ కోసం వరుసగా మాస్ అండ్ యాక్షన్ సినిమాలనే లైన్లో పెడుతున్నాడు.ది వారియర్ అంటూ తెరకెక్కిన సినిమా ప్లాప్ అయినా రామ్ ఎక్కడ తగ్గడం లేదు.

రామ్ ఇప్పుడు యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ‘స్కంద( Skanda ) సినిమా చేస్తున్నాడు.ఫుల్ స్వింగ్ లో యాక్షన్ మూవీస్ ను లైన్లో పెడుతున్న రామ్ బోయపాటితో చేస్తున్న సినిమాతో మాస్ లో మరింత ఫాలోయింగ్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నాడు.బోయపాటి అంటేనే ఫుల్ ఊర మాస్.అల్లు అర్జున్( Allu Arjun ) కు సరైనోడు వంటి సినిమా ఇచ్చి అతడిని మాస్ హీరోగా నిలబెట్టాడు.

ఇక ఇప్పుడు రామ్ ను కూడా ఆ రేంజ్ లో మాస్ హీరోగా నిలబెడతాడా? అనే డీప్ డిస్కర్షన్ జరుగుతుంది.మరి బోయపాటి కూడా స్కంద సినిమాకు ముందు తర్వాత అని చెప్పుకునేలా రామ్ ను మార్చేస్తున్నారు అని తెలుస్తుంది.ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ ఈ విషయాన్నీ నిరూపించాయి.మరి స్కందగా మారిన రామ్ ఆ తర్వాత ఎలాంటి ఇమేజ్ ను తెచ్చుకుంటాడో వేచి చూడాల్సిందే.ఇక ఈ సినిమాలో రామ్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు థమన్ ( Thaman S )సంగీతం అందిస్తుండగా శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సెప్టెంబర్ 15న ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.ఎలా ఉంటుందో ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube