Mangalampalli Balamurali Krishna: మరో జన్మంటూ ఉంటె క్రికెటర్ గానే పుడతాడట….మనసులో మాట బయటపెట్టిన మహానుభావుడు.

ఆయన ఒక సుప్రసిద్ధ కళాకారుడు. కర్నాటిక్ సంగీత గాయకుడు, సినీ సంగీత దర్శకుడు, వయోలిన్ విద్వాంసుడు.

 Mangalampalli Balamurali Krishna About Singers Profession-TeluguStop.com

8 ఏళ్ళ అతి చిన్న వయసులోనే కచేరీలు మొదలుపెట్టి బాల మేధావిగా ప్రసిద్ధి చెందాడు.తన జీవితంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 వేల కచేరీలు చేసాడు.

భాతర ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించిన ఏకైక వ్యక్తి ఈయన.దేశ విదేశాలలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఈయన్ను గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి.ఇంతటి మహనీయుడు తనకు మరో జనమునంటూ ఉంటె క్రికేటర్( Cricketer ) గానే పుట్టాలని ఉందని అన్నారట.ఆయన ఎవరో కాదండి.

తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచ పటం పై నిలిపిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ( Mangalampalli Balamurali Krishna ) గారు.

Telugu Cricketer, Padma Bhushan, Padma Shri-Movie

అసలు ఆయన ఇలాంటి కామెంట్స్ చెయ్యడానికి కారణం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.బాలమురళీకృష్ణ గారు ఇలా క్రికెటర్ అవ్వాలన్న తన కోరిక బయట పెట్టడానికి కారణం ఆయనకు ఆట మీద ఉన్న ఆసక్తి కాదు.కేవలం సంగీతానికి( Music ) మన దేశంలో తగ్గుతున్న ఆదరణ.

క్రికెటర్లు బాగా ఆడితే డబ్బు ఇస్తారు.ఇల్లు, ఉద్యోగం ఇచ్చి గౌరవిస్తారు.

ఒక సారి మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకుంటే చాలు.అవకాశా వస్తూనే ఉంటాయి.

ఒక క్రికెటర్ తన జీవిత కాలంలో 10 వేల పరుగులు చేస్తే చరిత్రకెక్కుతాడు.కానీ బాలమురళీకృష్ణ గారు 25 వేల కచేరీలు చేసినప్పటికీ ఒక క్రికెటర్ కి ఉన్న గుర్తింపు

Telugu Cricketer, Padma Bhushan, Padma Shri-Movie

ఈ దేశంలో తనకు రాలేదని బాధపడ్డారు.బాలమురళీకృష్ణ గారి లాంటి విద్వాంసుడికి ఒక కచేరీకి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చిన సరే ఆయన కోటీశ్వరుడు అయ్యుండేవాడు.కానీ ఆలా జరగలేదు.

కారణం కళారంగంలో పొగడ్తలు తప్ప సంపాదన ఉండదు.అందరు గొప్పగా చెప్పుకోవడమే కానీ డబ్బు మాత్రం రాదు.

ఇది మనందరం అంగీకరించవలసిన ఒక చేదు నిజం.బాలమురళీకృష్ణ 1930, జూలై 6న మద్రాసు రాష్ట్రం లోని, తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా శంకరగుప్తంలో జన్మించారు.

ఆయన గురువు పారుపల్లి రామకృష్ణయ్య.( Parupalli Ramakrishnaiah ) ఈయన 2016లో చెన్నై లో తన స్వగృహం నందు కన్ను మూసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube