హైదరాబాద్ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు.ఈ మేరకు రేపు ఉదయం 10 గంటలకు కార్యకర్తలతో భేటీ కానున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగా మల్కాజ్ గిరి నియోజకవర్గ నేతలు అందరికీ మైనంపల్లి ఆహ్వానాలు పంపారని సమాచారం.రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మైనంపల్లిని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదని మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి సంచలన ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మైనంపల్లిపై పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది.? మైనంపల్లి బీఆర్ఎస్ లో కొనసాగుతారా.? లేదా.? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







