సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నరేష్( Naresh ) కుమారుడుగా నవీన్ ( Naveen ) చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది ఈయన హీరోగా నటించిన సక్సెస్ కాకపోవడంతో అనంతరం టెక్నీషియన్ గా మారిపోయారు.ఈ క్రమంలోనే డైరెక్టర్గా సాయిధరమ్ తేజ్ హీరోగా సత్య అనే షార్ట్ ఫిలిం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ షార్ట్ ఫిలిం ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం( Road Accident ) గురించి మాట్లాడారు.సాయి ధరంతేజ్ నవీన్ ఇద్దరు కూడా చాలా ప్రాణ స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు.
ఇద్దరు వెకేషన్లలోనే ఉంటారు ఇద్దరు కలిసి బైక్ రైడింగ్ కూడా వెళ్తారు.
వీరిద్దరూ ప్రతిరోజు బైక్ రైడింగ్ ( Bike Riding ) వెళుతూనే ఉంటారట.అయితే సాయి ధరంతేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన రోజు కూడా వీరిద్దరూ బైక్ రైడింగ్ వెళ్లారని అందుకు కారణం నవీన్ కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించిన నవీన్ తాను సాయి ధరంతేజ్ తో కలిసి బైక్ రైడ్ వెళ్లిన తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసే నేను ఇంటికి వెళ్తాను అయితే ఆరోజు ఇల్లు దగ్గరే కదా నేను వెళ్తాను నువ్వు వెళ్ళు అంటేనే నేను ఇంటికి వెళ్ళానని ఇంటికి వెళ్లే లోపు ఈ విషయం తెలిసే షాక్ అయ్యానని నవీన్ తెలిపారు.
ఈ విషయం తెలిసిన వెంటనే హాస్పిటల్ కి వెళ్లి అక్కడ సాయి తేజ్ ను చూసి తాను చల్లించిపోయానని ఆ సమయంలోనే తాను ఒక నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
ఇకపై బైక్ రైడింగ్ వెళ్లకుండా ఉండడం కోసం తన దగ్గర ఉన్నటువంటి వివిధ రకాల బైక్స్ అన్నింటినీ కూడా అమ్మేశానని ఈ సందర్భంగా నవీన్ తెలియజేశారు.ఇలా సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) ప్రమాదానికి గురైన సమయంలో తనని ఆ పరిస్థితులలో చూసి ఇకపై ఎప్పుడూ కూడా బైక్ రైడింగ్ చేయకూడదన్న ఉద్దేశంతోనే తను తన గ్యారేజ్ లో ఉన్నటువంటి ఖరీదైన బైక్స్ అన్నింటిని కూడా అమ్మేశానని నవీన్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక నవీన్ హీరోగా వెండితెరకు దూరమవుతు టెక్నీషియన్ గా స్థిరపడ్డారు .తాజాగా సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాకి కూడా ఈయన ఎడిటర్ గా పనిచేశారు.