బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ కార్యక్రమం ఇప్పటికే ఆరో సీజన్లను పూర్తి చేసుకునే త్వరలోనే ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది.
ఇలా ఏడవ సీజన్ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారనే విషయం గురించి ప్రేక్షకులలో ఆత్రుత నెలకొంది.ఇప్పటికే ఈ కార్యక్రమంలో పలువురు కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారు అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే సెప్టెంబర్ మూడవ తేదీ ఏడవ సీజన్(Bigg Boss 7) ప్రసారం కానున్నటువంటి నేపథ్యంలో బిగ్ బాస్ రివ్యూయర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి (Adi Reddy)సోషల్ మీడియా వేదికగా ఈ సీజన్ లో పాల్గొన్న బోయే కంటెస్టెంట్ల పేర్లను బయటపెట్టారు.మరి ఆదిరెడ్డి ఈసారి సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్ ఎవరెవరు ఉన్నారని తెలియజేశారు.ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయానికి వస్తే…
బుల్లితెరపై నటీనటులుగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు అమర్ దీప్,( Amar Deep ) కార్తీకదీపం మోనిత,( Monitha ) జానకి కలగనలేదు ప్రియాంక జైన్, ( Priyanka Jain )అంజలి పవన్, జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్, యాంకర్ ప్రత్యూష, నటి షకీలా, మై విలేజ్ షో యూట్యూబర్ అనిల్ గీల, ఆట సందీప్,( Ata Sandeep ) పూజా మూర్తి, రియాజ్ , ప్రిన్స్ యావర్, శీతల్ గౌతమన్, రంగస్థలం మహేష్ ఆచంట, సింగర్ దామిని, పల్లవి ప్రశాంత్ యువ రైతుగా గుర్తింపు పొందారు.వీరితోపాటు జబర్దస్త్ నరేష్, గౌతమ్ కృష్ణ, యూట్యూబర్ తేజ, హీరోయిన్ ఫర్జానా, యాక్టర్ క్రాంతి, శుభశ్రీ రాయగురు వంటి వారు రాబోతున్నారని ఆదిరెడ్డి తెలియజేశారు.ఇక సెప్టెంబర్ మూడవ తేదీ ఈ హౌస్ లోకి 19 మంది లేదా 20 మంది కంటెస్టెంట్లు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఈయన తెలిపారు.