మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే.ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.
నవంబర్ లేదా డిసెంబర్లో వీరి వివాహం జరగబోతుందని వరుణ్ తేజ్ తెలియ చేశారు.ఇలా త్వరలోనే వీరి వివాహం జరగబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వీరి గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే లావణ్య త్రిపాటి విషయంలో నిహారిక( Niharika ) తన అన్నయ్య వరుణ్ తేజ్ కు చెప్పినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో తమకన్నా వయసులో చిన్నది అయినటువంటి నిహారిక తన వదిన గురించి వరుణ్ దగ్గర మాట్లాడుతూ పెళ్లి తర్వాత మీ ఇద్దరి విషయాలలో ఎవరిని ఇన్వాల్వ్ కాకుండా చూసుకోమని చెప్పారట అంతేకాకుండా లావణ్య గురించి ఎవరు ఏమి చెప్పినా కూడా పట్టించుకోవద్దని చివరికి మీ స్నేహితుల వద్ద కూడా మీ పర్సనల్ విషయాలను చర్చించుకోవద్దని వారికి మీ విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశాలు కల్పించవద్దని చెప్పారట.
ఇక లావణ్యకు ఇష్టం వచ్చిన విధంగానే నడుచుకొమ్మని తనకు నీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని తనకు నచ్చిన విధంగానే చేయాలి అంటూ తన వదినను బాగా చూసుకోవాలని నిహారిక తన అన్నయ్య వరుణ్ తేజ్ ముందుగానే సూచనలు చేశారట.అయితే నిహారిక ఇలా చెప్పడానికి కారణం తన భర్త మాజీ జొన్నలగడ్డ వెంకట చైతన్య( Jonnalagadda Venkata Chaitanya ) నుంచి తనకు ఏమాత్రం మద్దతు లేకపోవడం తమ వ్యక్తిగత విషయాలలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్లే తమ వైవాహిక జీవితం విడాకుల వరకు వెళ్లిందని నిహారిక మాటలు బట్టి తెలుస్తుంది.అందుకే తన అన్నయ్య వదినల విషయంలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదన్న ఉద్దేశంతోనే ముందుగా నిహారిక వరుణ్ తేజ్ కు ఈ విషయాలన్నీ తెలియజేసారట.