తెలంగాణలో కమలం పార్టీ దూకుడు..!!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కమలం పార్టీ దూకుడు పెంచింది.ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి రానున్నారు.

 Kamalam Party Aggression In Telangana..!!-TeluguStop.com

ఈనెల 27వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధం కాగా ఈ సభకు అమిత్ షా హాజరుకానున్నారు.అమిత్ షా పర్యటనతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది.

పర్యటనలో భాగంగా ముందుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు రానున్న అమిత్ షా అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కొత్తగూడెంకు వెళ్లనున్నారు.భద్రాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సభా ప్రాంగణానికి వెళ్తారు.

సభలో ప్రసంగించిన అనంతరం తెలంగాన బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై షా చర్చించనున్నారని తెలుస్తోంది.

తరువాత ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube