తెలంగాణ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధం...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు( Telangana Assembly Elections ) ఈ ఏడాది చివరిలోగా జరగనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి.

 Everything Is Ready For Telangana Election Battle...! Telangana Assembly Electio-TeluguStop.com

బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.బీజేపీ,కాంగ్రెస్ సైతం తొలి జాబితాను ప్రకటించేందుకు కసరత్తులు చేస్తున్నాయి.

మరోవైపు ఎన్నికల సంఘం కూడా అసెంబ్లీ ఎన్నికల విషయమై కసరత్తు ప్రారంభించింది.అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తోంది.

డిసెంబర్ రెండో వారంలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు రూపొందిస్తోంది.తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16 వరకు ఉంది.

2014లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోనే చివరి ఎన్నికలు జరిగాయి.కానీ, ఐదేళ్లు పూర్తి కాకుండానే కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

దీంతో 2018 అక్టోబర్ 6న ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.సరిగ్గా రెండు నెలలకు అంటే డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించారు.

ఎమ్మెల్యేలంతా జనవరి 17న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు.దీంతో జనవరి 16వ తేదీ వరకు ప్రస్తుత అసెంబ్లీ మనుగడ సాగించే అవకాశం ఉంది.

తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్,రాజస్థాన్, మధ్యప్రదేశ్,మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకేసారి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) రెండు సార్లు రాష్ట్రంలో పర్యటించనుంది.

ఎన్నికల సన్నద్ధతను పరిశీలించడానికి ఓసారి, నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత మరోసారి సీఈసీ బృందం రాష్ట్రానికి రానుంది.అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటోంది.తెలంగాణలోనూ డబ్బు ప్రభావం పెరిగిందని మునుగోడు, హుజూరాబాద్( Huzurabad ) ఉపఎన్నికలను బట్టి చెప్పొచ్చు.ఈ ఉపఎన్నికల్లో పార్టీలు భారీగా డబ్బును పంచాయనే ప్రచారం జరిగింది.దీంతో ఎన్నికల్లో నగదు ప్రభావాన్ని అరికట్టడానికి నిఘాను పెంచనుంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను సైతం ఎన్నికల సంఘం రంగంలోకి దింపనుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube