టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.నడక దారిలో తిరుమల వరకు ఇనుప కంచె ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో కోరారు.
పులులు, ఎలుగు బంట్లు వంటి జంతువుల బారి నుంచి భక్తులను కాపాడాలని పిటిషనర్ పిల్ లో పేర్కొన్నారు.నడక దారిలో ఇటీవల చిరుత చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలిక లక్షిత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి నష్ట పరిహారం చెల్లించేలా చూడాలని పిటిషనర్ కోర్టును కోరనున్నారు.ఈ క్రమంలో భానుప్రకాశ్ రెడ్డి పిటిషన్ సోమవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.







