తుమ్మలకు.. అందుకే కాంగ్రెస్ రెడ్ కార్పెట్ ?

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్( Tummala Nageswara Rao ) బి‌ఆర్‌ఎస్ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇటీవల ప్రకటించిన బి‌ఆర్‌ఎస్ మొదటి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

 For Tummalaa That's Why Congress Red Carpet , Congress, Brs, Politics, Tummala N-TeluguStop.com

బి‌ఆర్‌ఎస్ అధిష్టానంపై కే‌సి‌ఆర్( KCR ) తీరుపై తుమ్మల వర్గం బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తోంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల ఎంతో అభివృద్ది చేశారని అలాంటి ఆయనకు టికెట్ నిరాకరించడం ఏంటని తుమ్మల వర్గీయులు వాపోతున్నారు.

కాగా తుమ్మల పాలేరు టికెట్ ఆశించారు కానీ కే‌సి‌ఆర్ అందుకు నిరాకరించారు.ప్రస్తుతం తుమ్మల పార్టీ మారేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు.

Telugu Congress, Paleru Ticket-Latest News - Telugu

ఒకవేళ ఆయన పార్టీ విడితే బి‌ఆర్‌ఎస్( Brs ) కు గట్టి దేబ్బే అని చెప్పాలి ఎందుకంటే ఉమంది ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది బి‌ఆర్‌ఎస్ పార్టీ ఇలాంటి సందర్భంలో జిల్లాలో కీలక నేతగా ఉన్న తుమ్మల పార్టీ విడితే నష్టమే అనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.కాగా తుమ్మల కాంగ్రెస్ లోకి వస్తానంటే ఆహ్వానిస్తామని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు.దీంతో తుమ్మల హస్తం పార్టీలోకి వెళ్లాలా లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా అనే దానిపై ఆయన సన్నిహిత వర్గంతో చర్చలు జరుపుతున్నారట.

Telugu Congress, Paleru Ticket-Latest News - Telugu

ప్రస్తుతం తుమ్మలను బుజ్జగించే కార్యక్రమాలు బి‌ఆర్‌ఎస్ చేస్తున్నప్పటికి ఆయన అసంతృప్తి వీడడం లేదని టాక్.ఒకవేళ బి‌ఆర్‌ఎస్ ను వీడడం ఖాయమే అయితే హస్తం గూటికి చేరడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది.ఎందుకంటే తుమ్మల ఆశిస్తున్న పాలేరు టికెట్ ( Paleru ticket )పై ప్రస్తుతం కాంగ్రెస్ లో సస్పెన్స్ కొనసాగుతోంది.

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరితే పాలేరు టికెట్ ఆమెకే ఇచ్చే అవకాశం ఉంది.లేకపోతే పాలేరు టికెట్ విషయంలో తుమ్మలనే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.

అందుకే ఆయన కాంగ్రెస్ లో చేరాలని తుమ్మల వర్గీయులు కూడా సూచిస్తున్నట్లు వినికిడి.మరి తుమ్మల ఎటువైపు వేలతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube