అమెరికా, ఆస్ట్రేలియాల్లో( America , Australia ) జరిగిన వేర్వేరు ఘటనల్లో హర్యానా రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.మృతులను పంకజ్, మిలన్‌దీప్ సింగ్‌లుగా( Pankaj , Milandeep Singh ) గుర్తించారు.
కర్నాల్ జిల్లా రహ్రా గ్రామానికి చెందిన పంకజ్ (19) అమెరికాలో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో ప్రాణాలు కోల్పోయాడు.ఇతను గతేడాది దొడ్డిదారిలో అమెరికాకు వెళ్లినట్లుగా తల్లిదండ్రులు చెబుతున్నారు.ఇందుకోసం ట్రావెల్ ఏజెంట్లకు రూ.40 లక్షలు చెల్లించినట్లు పంకజ్ కుటుంబం వెల్లడించింది.అతను పనిచేస్తున్న షాప్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది.భద్రత కోసం ఉంచిన పిస్టల్‌ను తనిఖీ చేస్తుండగా ప్రమాదవశాత్తూ అది పేలింది.దీంతో పంకజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను పంకజ్ కుటుంబ సభ్యులు కోరారు.

మరో ఘటనలో కైతాల్ జిల్లా చాబా గ్రామానికి( Chaba Village, Kaithal District ) చెందిన 23 ఏళ్ల మిలన్‌దీప్ సింగ్ ఐదేళ్ల క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు.ఈ క్రమంలో అతను కొద్దిరోజుల క్రితం అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.మిలన్ మరణవార్తను అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటాడనుకున్న కుమారుడు తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా.ఇటీవల కెనడాలో( Canada ) జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పంజాబ్ యువకుడి మృతదేహం ఆదివారం స్వదేశానికి చేరుకుంది.ఫాజిల్కాకు చెందిన దిల్‌ప్రీత్ సింగ్ గ్రేవాల్ ( Dilpreet Singh Grewal )మృతదేహాన్ని పంజాబ్ ప్రభుత్వం సహాయంతో నిన్న అమృత్‌సర్‌లోని గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు.గ్రేవాల్ భౌతికకాయాన్ని అందుకోవడానికి పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్ అధికారులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.
ఉజ్వల భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన యువత ఊహించని ప్రమాదాల బారినపడి కుటుంబ సభ్యులకు తీరని దు:ఖాన్ని మిగులుస్తున్నారని ధాలివాల్ ఆవేదన వ్యక్తం చేశారు.దిల్‌ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు తనను సంప్రదించగా.
తాను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దృష్టికి తీసుకెళ్లినట్లు కుల్‌దీప్ సింగ్ ధాలివాల్ తెలిపారు.







