హన్మకొండ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది.
ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కార్యాలయం ముట్టడికి యత్నించారు.ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
క్యాంపు కార్యాలయం ముట్టడికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఉద్రిక్తతల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు.మరోవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.