బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రాజీనామా..!

మాజీ ఎమ్మెల్యే వేమల వీరేశం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.తాజాగా కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తనకు స్థానం లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 Former Brs Party Mla Vemula Veeresham Resigns..!-TeluguStop.com

ఈ మేరకు నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.వారం రోజుల్లో పార్టీలో చేరిక అంశంపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

గత నాలుగున్నర ఏళ్లుగా తనను ఏం చేశాంటూ హింసిస్తున్నారన్న ఆయన ఉద్యమ కాలంలో దెబ్బలు తిని జైలుకు వెళ్లిన సంగతి గుర్తు చేశారు.గన్ మెన్ లను తొలగించడంతో పాటు జిల్లా నాయకత్వం తనను పట్టించుకోలేదని వాపోయారు.

నేటితో బీఆర్ఎస్ తో ఉన్న బంధం తెగిపోయిందన్న వేముల తన రాజీనామా లేఖను అనుచరులు, నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతున్నట్లు తెలిపారు.అనంతరం నియోజకవర్గంలో దారుణాలు జరుగుతున్నాయని, వాటిపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలంటూ సవాల్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube