కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విద్యావిధానాన్ని అనుసరించి చోటు చేసుకున్న కీలక మార్పులను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ మేరకు సంవత్సరానికి రెండుసార్లు ఇంటర్ బోర్డు పరీక్షలు జరగనున్నాయని తెలుస్తోంది.
విద్యార్థులు తమ ప్రిపరేషన్ కు అనుగుణంగా పరీక్షలను రాయవచ్చు.అదేవిధంగా రెండు బోర్డు పరీక్షలు రాసిన విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో సాధించిన ఉత్తమ మార్కులను ఎంపిక చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులు విధిగా రెండు భాషలను అభ్యసించాలి.ప్రస్తుతం అనుసరిస్తున్న బోర్డు పరీక్షల ప్రాసెస్ ను మరింతగా సరళీకృతం చేసేందుకు గానూ ఏడాదిలో రెండుసార్లు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.
దీని ద్వారా విద్యార్థులకు కూడా తగినంత సమయం దొరకడంతో పాటు బాగా రాసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.అంతేకాకుండా కొత్త పాఠ్య ప్రణాళిక ప్రకారం 11, 1 తరగతులలోని సబ్జెక్టులను ఎంచుకునే ఛాయిస్ కేవలం ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వంటి గ్రూపులకు మాత్రమే పరిమితం కాదని వెల్లడించింది.
ఈ క్రమంలోనే 2024 విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలను రూపొందించినట్లు తెలిపింది.







