ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు అనుచరులు సమావేశం కానున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు తుమ్మల అభిమానుల పేరిట ఆత్మీయ సమావేశం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి.అయితే ఈ ప్లెక్సీలలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫోటోలు లేకపోవడం గమనార్హం.
రానున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ జాబితాలో బీఆర్ఎస్ నుంచి తుమ్మలకు ఎమ్మెల్యే టికెట్ ను పార్టీ అధిష్టానం ఇవ్వని సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కీలక సమావేశం నిర్వహించనున్న తుమ్మల అనుచరులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.వైరాలోనూ తుమ్మల అనుచరుల రహస్య సమావేశం అయినట్లు తెలుస్తోంది.
తుమ్మల బాటలోనే తాము నడుస్తామంటున్నారు అనుచరులు.మరోవైపు తుమ్మలను కలిసేందుకు కొందరు అనుచరులు హైదరాబాద్ కు వెళ్లనున్నారు.
.







