సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో రికార్డులు నెల్కొలపడం, వాటిని మరొక హీరో బద్దలు కొట్టడం చాలా సహజం.కానీ చిరంజీవి పేరున ఉన్న ఈ రికార్డు మాత్రం ఇక ఏవరు టచ్ చెయ్యలేరనే చెప్పాలి.
సుమారు 40 ఏళ్ళ తన సినీ ప్రస్థానంలో చిరంజీవి( Chiranjeevi ) ఒక అరుదయిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.ఆ రికార్డు ఏమిటో తెలుసుకోవాలనుందా? అదేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
![Telugu Chiranjeevi-Telugu Stop Exclusive Top Stories Telugu Chiranjeevi-Telugu Stop Exclusive Top Stories](https://telugustop.com/wp-content/uploads/2023/08/chiranjeevi-industry-hits-back-to-backa.jpg)
ఎవరైనా హీరో కెరీర్ లో ఒక ఇండస్ట్రీ హిట్ వచ్చిందంటే అతను ఇక స్టార్ అయినట్టే.అలాంటి ఇండస్ట్రీ హిట్ లకు కేర్ అఫ్ అడ్రస్ మన మెగా స్టార్ చిరంజీవి.ఆయన తన కెరీర్ లో “ఖైదీ”( khidhi ) తో మొదలుకొని “ఇంద్ర”( indra ) వరకు ప్రతి ఏటా ఒక ఇండస్ట్రీ హిట్ అందుకొని ఏకంగా ఎనిమిది ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు.ఐతే విశేషమేమిటంటే ఈ రెండు చిత్రాలు కాకుండా మిగిలిన ఆరు ఇండస్ట్రీ హిట్ లు వరుసగా ఏడాదికొక ఇండస్ట్రీ హిట్ చొప్పున ఆరేళ్లలో సాధించారు.
![Telugu Chiranjeevi-Telugu Stop Exclusive Top Stories Telugu Chiranjeevi-Telugu Stop Exclusive Top Stories](https://telugustop.com/wp-content/uploads/2023/08/chiranjeevi-industry-hits-back-to-backb.jpg)
చిరంజీవి మొదటి ఇండస్ట్రీ హిట్ విషయానికి వస్తే అది ఖైదీ.ఈ చిత్రం 1983 లో విడుదలయింది.చిరంజీవిని సూపర్ స్టార్ ని చేసిన సినిమా కూడా ఇదే అని ఒప్పుకొని తీరాల్సిందే.తరువాత 1987 లో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో “పసివాడి ప్రాణం” చిరు కి దక్కిన రెండో ఇండస్ట్రీ హిట్.
ఆ తరువాత రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో “యముడికి మొగుడు” (1988) కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యింది, మళ్లీ కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో “అత్తకు యముడు అమ్మాయికి మొగుడు” (1989), రాఘవేందర్రావు దర్శకత్వంలో “జగదేకవీరుడు అతిలోక సుందరి” (1990),విజయ బాపినీడు దర్శకత్వంలో “గ్యాంగ్ లీడర్”( Gang Leader ) (1991), మరోసారి రాఘవేందర్రావు దర్శకత్వంలో “ఘరానా మొగుడు” (1992), చిత్రాలతో వరుసగా ఆరు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు.ఇది తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న ఒక అరుదయిన రికార్డు.
ఇండస్ట్రీ హిట్ కొట్టగలిగే కెపాసిటీ ఉన్నప్పటికీ, రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్న ఇప్పటి స్టార్ హీరోలకు మెగా స్టార్ పేరు మీదున్న ఈ రికార్డును బ్రేక్ చెయ్యడం అసాధ్యమనే చెప్పాలి.