మన దేశంలో 20 నుంచి 30 శాతం మంది విద్యార్థినీ విద్యార్థులు ఆర్థిక సమస్యల వల్ల చదువు విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అయితే కొంతమంది మాత్రం ఆ కష్టాలను ఎదురీది సక్సెస్ సాధించి ప్రూవ్ చేసుకుంటున్నారు.
భద్రాద్రి జిల్లాలోని కాటాయిగూడెం( Kataigudem ) అనే గిరిజన గ్రామానికి చెందిన కోర్సా లక్ష్మీ( Korsa Lakshmi ) తల్లీదండ్రులకు చదువు లేకపోవడంతో చిన్న వయస్సులోనే చదువు విలువను అర్థం చేసుకున్నారు.
కష్టపడితే ఏదో ఒకరోజు కోరుకున్న సక్సెస్ దక్కుతుందని భావించిన లక్ష్మి తన ప్రతిభతో కెరీర్ పరంగా సక్సెస్ అయ్యారు.
లక్ష్మి తండ్రి సైకిల్ పై వీధీ వీధీ తిరుగుతూ ఐస్ క్రీమ్( Ice cream ) అమ్మేవారు.అమ్మ కూలి పనులు చేసేవారు.చదువుకోవాలని చెబితే పెద్దన్నయ్య ఇంటినుంచి వెళ్లిపోయాడని చిన్నన్నయ్య కూడా సరిగ్గా చదువుకోకుండా పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడని కుటుంబ సభ్యులు నాపైనే ఆశలు పెట్టుకున్నారని ఆమె అన్నారు.

కాటాయిగూడెం ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి వరకు చదివిన లక్ష్మి ఐదో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంలో భద్రాచలం( Bhadrachalam ) గురుకుల పాఠాశాలలో చదివారు.పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన లక్ష్మి ఇంటర్ గురుకులాల్లో చదివి జేఈఈ శిక్షణ తీసుకున్నారు.ఇంటర్ లో లక్ష్మికి 992 మార్కులు రాగా జేఈఈలో 1371 ర్యాంక్ రావడంతో పాట్నా ఐఐటీలో సీటు వచ్చింది.

లక్ష్మికి ఐఐటీలో సీటు వచ్చిన తర్వాత ఇరుగూపొరుగు వాళ్లు ఆడపిల్లలకు చదువు అవసరమా అంటూ విమర్శలు చేశారు.తల్లీదండ్రులు కూడా లక్ష్మిని ని పాట్నా ఐఐటీకి పంపడానికి ఇష్టపడలేదు.ఆ సమయంలో ప్రిన్సిపాల్ సర్దిచెప్పడంతో తల్లీదండ్రుల నిర్ణయం మారింది.ఐఐటిలో ఈఈఈ తీసుకున్న లక్ష్మి భవిష్యత్తులో సివిల్స్ సాధిస్తానని చెబుతున్నారు.లక్ష్యాన్ని సాధించి సమాజానికి సేవ చేస్తానని లక్ష్మి చెబుతున్నారు.లక్ష్మి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.







