వాహనదారులారా బహుపరాక్.కొత్త రూల్స్ అమలులోకి వచ్చేస్తున్నాయ్.
కాబట్టి వాహనదారులు ఈ కొత్త రూల్స్‌ను తెలుసుకోవడం, అదేవిధంగా పాటించడం మంచింది.లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.
అవును, తాజాగా కర్నాటక ప్రభుత్వం ( Karnataka Govt ) జారీచేసిన కొత్త నిబంధనలు వింటే మీకు మతిపోతుంది.దీని ప్రకారం అన్ని వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్లు ఉండి తీరాల్సిందే.
అన్ని వెహికల్స్‌కు ఇకపై హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మీడియా నివేదికల ప్రకారం గమనిస్తే.కొత్త నంబర్ ప్లేటు రూల్స్ నవంబర్ 17 నుంచి అమలులోకి రానున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇప్పటికే ప్రభుత్వం కొత్త రూల్స్‌కు సంబంధించి కొత్త నోటిఫికేషన్ జారీ చేసేసింది.
ఈ నవంబర్ 17 తర్వాత వెహికల్స్‌కు ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేటు( High Security Number Plates ) లేకపోతే మాత్రం భారీ జరిమానా పడుతుందని చెప్పకనే చెబుతోంది అక్కడి ప్రభుత్వం.ఒకవేళ రూల్స్ అతిక్రమిస్తే మాత్రం.రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా వదిలిపోతుంది.అందువల్ల వాహనదారులు తక్షణమే మీ వెహికల్‌కు ( Vehicles )హై సెక్యూరిటీ నెంబర్ ప్లేటు లేకపోతే వెంటనే వేయించుకోవడం ఉత్తమం.

ఇంకో విషయం ఇక్కడ ఖచ్చితంగా గమనించి తీరాలి.కొంత మంది స్టైలిస్ నెంబర్ ప్లేట్స్ వాడుతూ ఉంటారు.అలాంటి వారు వాటిని వెంటనే తొలగించి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేటు వేసుకోవాలని సూచిస్తున్నారు.లేదంటే మాత్రం ట్రాఫిక్ పోలీసులకు( Traffic Police ) చలానా చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఇకపోతే, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్‌కు ప్రత్యేకమైన ఫీచర్లు ఉంటాయి.వీటికి పర్మనెంట్ ఐడెంటిపికేషన్ నెంబర్, క్రోమియం బేస్డ్ హోలోగ్రామ్ వంటివి ఉంటాయి.
వర్చువల్‌గా వీటిని ట్యాంపరింగ్ చేయడం అనేది కుదరని పని.ఇకపోతే అన్ని వెహికల్స్‌కు రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఒకేలా ఉండాలనే లక్ష్యంలో స్టాండర్డైజేషన్ లక్ష్యంగా ఈ కొత్త రూల్స్ అమలు చేస్తున్నట్లు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు చెందినవారు తెలియజేసినట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.







