హైదరాబాద్ లో లెఫ్ట్ పార్టీల కార్యవర్గ సభ్యులు సమావేశం అయ్యారు.బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనతో వామపక్షాలకు సీఎం కేసీఆర్ ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సీపీఐ, సీపీఎం పార్టీల కార్యవర్గ భేటీలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి.రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై పార్టీ కార్యవర్గ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీతో పొత్తులు వద్దని చెప్పినా వినకుండా ముందుకు వెళ్లారని పార్టీ ముఖ్యనేతలు మండిపడ్డారు.పొత్తులు ఉండవని కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు లీకులు ఇచ్చినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చిస్తున్నారని సమాచారం.







