చాలా కాలంగా హిట్ లేక బాధ పడుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కు అసలు సిసలైన హిట్ లభించింది.గత దశాబ్దంలో రజినీకాంత్ అందుకోలేని హిట్ లేటెస్ట్ గా నటించిన సినిమాతో అందుకున్నాడు.
రజినీకాంత్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జైలర్( Jailer Movie )”.ఆగస్టు 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సంచలన విజయంగా నిలిచింది.

రెండవ వారంలోకి అడుగు పెట్టిన కూడా రజనీకాంత్ జైలర్ కలెక్షన్స్ తో అరాచకం సృష్టిస్తుంది.తెలుగులో కూడా తలైవర్ ఏకంగా 60 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు.ఇప్పటికే 500 కోట్ల క్లబ్ లో చేరిపోయిన ఇంకా రన్ కొనసాగిస్తూనే ఉంది.మరి ఈ సినిమాతో సక్సెస్ సాధించిన రజనీకాంత్( Rajinikanth ) వెంటనే ఒక వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
ఈయన మొన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాళ్లకు మొక్కడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

వయసులో పెద్ద వాడైనా రజనీకాంత్ చిన్న వాడైనా యోగి( Yogi Adityanath ) కాళ్లకు మొక్కడం తమిళ్ ప్రజలను ఆగ్రహానికి తెప్పించింది.ఆత్మగౌరవాన్ని ఆయనకు తాకట్టు పెట్టారా అంటూ ఈయనపై ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి.మరి ఇదే విషయంపై తాజాగా రజనీకాంత్ స్పందించారు.
ఈయన మాట్లాడుతూ సాలిడ్ రియాక్షన్ ఇచ్చి ఈ వివాదానికి ముగింపు పలికారు.ఈ అంశం గురించి మాట్లాడుతూ.
నేను ఒక యోగి అయినా సన్యాసికి అయినా తన కన్నా చిన్న పెద్ద వయసు వారా అనే తేడా చూడను.ఆ అలవాటు నాకు లేదు.
వారి కాళ్లకు ఎప్పుడు నంస్కరిస్తాను అంటూ ఈయన నవ్వుతూనే వివాదానికి చెక్ పెట్టారు.దీనితో ఈయనను విమర్శించే వారికీ చెక్ పడింది.








