వైరల్: మనుషులు లేకుండా నడుస్తున్న వాహనాలు.. ట్విస్ట్ ఇదే!

అవును, మీరు విన్నది నిజమే.మనుషులు లేకుండా వాహనాలు( Vehicles ) నడుస్తున్నాయి.

 Mystery Behind Horse Drawn Carriage Being Driven By Ghosts In Indonesia Video Vi-TeluguStop.com

వినడానికి ఆశ్చర్యంగా వున్నా, భయానకంగా వున్నా ఇది నిజమే.మరి డ్రైవర్ లేనపుడు అందులో దయ్యాలు గాని ఉన్నాయా? అనే ఆశ్చర్యం, అనుమానం కలగక మానదు.ఆ విషయం పక్కన పెడితే.చాలామంది దేవతలు, దెయ్యాల పేరుతో వివిధ రకాలుగా సొమ్ము చేసుకోవడం చూస్తూనే ఉన్నాం.ఇక దయ్యాల పేరుతో ఎన్ని సినిమాలు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మనం కూడా దెయ్యాల సినిమా కథలనే ఎక్కువగా చూస్తూ ఉంటాం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) అందుబాటులో ఉండడంతో పలువురు ఇలాంటి వీడియోలు చేసి లక్షలు సంపాదిస్తున్నారు కూడా.

Telugu Driven, Driverlesshorse, Horsedrawn, Indonesia, Mystery, Road, Travel, Ve

తాజాగా, ఓ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.రాత్రి వేళ మనుషులు లేకుండానే వాహనాలు నడుస్తున్నాయని, అది దయ్యాల పనే అని జనాల్ని నమ్మబలుకుతూ వీడియోలను చూసేటట్టు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.అయితే చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని ఒక్కసారి గమనిస్తే, ఇండోనేషియా( Indonesia ) టుబాన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.స్థానిక ప్రాంతంలో రాత్రి వేళ గుర్రపు బండి ఆకారంలో ఉన్న వాహనం రోడ్డుపై దూసుకెళ్తూ ఉంటుంది.

ఆ బండి వెనుకే ఇంకో వాహనంలో వెళ్తున్న వారు.ఈ దృశ్యాన్ని చూసి షాక్ అవుతారు.

Telugu Driven, Driverlesshorse, Horsedrawn, Indonesia, Mystery, Road, Travel, Ve

బండిని ఫాలో అవుతూ వెళ్లిన వారు.ముందు వైపు చూడగా ఎవరూ వుండరు.దీంతో ఆ బండిని నడుపుతున్నది దయ్యమే( Devil ) అని ఫీల్ అవుతుంటారు.ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు.

దాంతో రాత్రి వేళ దయ్యాలు వాహనాల్లో తిరుగున్నాయంటూ పుకార్లు వెల్లువెత్తడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ జనం ఆసక్తిగా చర్చించుకోవడం మొదలెట్టారు.చివరకు పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీయగా విచారణలో ఇదంతా ప్రజల్ని భయపెట్టడానికి కొందరు కావాలని చేసిన పని అని తెలిసింది.

ఎద్దుల బండికి( Bullock Cart ) తాడు కట్టి కొందరు ముంద వైపు లాగుతూ వెళ్లడం వల్ల అలా కనిపించిందని, ప్రజల్ని నమ్మించడానికి వీడియో తీసి వైరల్ చేశారని తేలింది.దాంతో నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు తగిన శాస్తి జరిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube