పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఓజి”.( OG Movie ) ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూట్ పూర్తి చేసుకుంది.
పవన్ వారాహి యాత్ర ముందు వరకు స్పీడ్ గా పూర్తి అయినా ఈ సినిమా ఆ తర్వాత పవన్ డేట్స్ లేక స్లో అయ్యింది.ఇక గత రెండు మూడు నెలలుగా ఈ సినిమా షూట్ 10 శాతం కూడా పూర్తి అవ్వలేదు.
పవన్ లేని పోర్షన్ పూర్తి చేస్తున్న కూడా అంత ఫాస్ట్ గా అవ్వడం లేదు.అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
అక్టోబర్ నుండి ఈ సినిమా సెట్స్ లో పవన్ జాయిన్ కానున్నారట.అక్టోబర్ లో 20 రోజులు, నవంబర్ లో 8 రోజుల పాటు పవన్ డేట్స్ ఇచ్చారని ఆ కాల్ షీట్స్ ప్రకారం షూటింగ్ లో పాల్గొననున్నట్టు టాక్ వస్తుంది.
ఇక అక్టోబర్ నెలలో థాయిలాండ్, బ్యాంకాక్ లలో షూటింగ్ జరగనుందట.మరి ఈ ప్రకారం ఈ రెండు నెలలో డేట్స్ తోనే ఈ సినిమాను పవన్ ముగించనున్నట్టు తెలుస్తుంది.చూడాలి నవంబర్ కు పూర్తి అయితే డిసెంబర్ లో కానీ జనవరిలో కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.పవన్ ఇందులో గ్యాంగ్ స్టర్ గా( Gangster Role ) నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్( Priyanka Mohan ) హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సుజీత్ ( Director Sujeeth ) ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
మరి బ్రోతో డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కు ఓజి మంచి కిక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.