పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
భారీ బడ్జెట్ మూవీగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న పవన్ ఓజీ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా టీజర్ ని సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే కానుకగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ టీజర్ లో ఏయే అంశాలు ఉంటాయన్నది ఓ టాక్ వినిపిస్తుంది.
పవన్ ఎంట్రీ తో పాటుగా సినిమా మెయిన్ థీం కి సంబధించిన కొన్ని యాక్షన్ సీన్స్ తో ఈ టీజర్ ఉంటుందని తెలుస్తుంది.అంతేకాదు పవన్ మార్క్ పంచ్ డైలాగ్ కూడా టీజర్ లో ఉండబోతుందని తెలుస్తుంది.
OG టీజర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంటుందని చెబుతున్నారు.ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
సినిమాను అసలైతే ఈ ఇయర్ డిసెంబర్ రిలీజ్ అనుకుంటున్నా 2024 సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.







