కరీంనగర్ ఎంపీ ,మాజీ తెలంగాణ బిజెపి ( BJP party )అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) నేడు ఏపీలో పర్యటిస్తున్నారు.ఇటీవలే ఆయనకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.
అలాగే నాలుగు రాష్ట్రాల బాధ్యతలను పార్టీ తరఫున బండి సంజయ్ కు అప్పగించారు.ఏపీ , మహారాష్ట్ర, ఒడిశా, గోవా, రాష్ట్రలతో పాటు, ముంబై సిటీ బాధ్యతలను బండి సంజయ్ చూస్తున్నారు.
ముఖ్యంగా ఏపీలో బిజెపి పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడంతో, బిజెపి గ్రాఫ్ పెంచే విధంగా, నాయకుల్లో భరోసా కల్పించేందుకు సంజయ్ రంగంలోకి దిగబోతున్నారు.
ఏపీలో ఇటీవలే రాష్ట్ర నాయకత్వాన్ని మార్చారు.
సోమ వీర్రాజును తప్పించి ఆస్థానంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి( Daggubati Purandeswar )ని నియమించారు.ఆమెతో పాటు, బండి సంజయ్ కు ఏపీ బాధ్యతలు అప్పగించడంతో ఇక వరుస వరుసగా సంజయ్ ఏపీలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈరోజు బండి సంజయ్ ఏపీలో అడుగు పెట్టారు.ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించేందుకు ఈరోజు ఉదయమే బండి సంజయ్ విజయవాడకు చేరుకోవాల్సి ఉన్నా , విమానం ఆలస్యం కావడంతో 11 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి 12 గంటలకు విజయవాడకు చేరుకున్నారు.
నేరుగా ఆయన ఏపీ బీజేపీ కార్యాలయానికి వెళ్లారు.

కరీంనగర్ ఎంపీ ,మాజీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేడు ఏపీలో పర్యటిస్తున్నారు.ఇటీవలే ఆయనకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.అలాగే నాలుగు రాష్ట్రాల బాధ్యతలను పార్టీ తరఫున బండి సంజయ్ కు అప్పగించారు.
ఏపీ , మహారాష్ట్ర, ఒడిశా, గోవా, రాష్ట్రలతో పాటు, ముంబై సిటీ బాధ్యతలను బండి సంజయ్ చూస్తున్నారు.ముఖ్యంగా ఏపీలో బిజెపి పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడంతో, బిజెపి గ్రాఫ్ పెంచే విధంగా, నాయకుల్లో భరోసా కల్పించేందుకు సంజయ్ రంగంలోకి దిగబోతున్న.

ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో సంజయ్ పాల్గొని సమీక్ష నిర్వహించనున్నారు.ఓటర్ మొబిలైజేషన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.అది ముగిసిన అనంతరం ఏడు గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్తారు.ఈ పర్యటనలోనే పార్టీ కీలక నాయకులతోను ఆయన బేటి కాబోతున్నారట .ఈ సందర్భంగా ఆయన ఏపీ రాజకీయాలపై ఏవిధంగా స్పందిస్తారు ? నాయకుల్లో ఉత్సవం పెంచే విధంగా ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.అలాగే ఏపీలో బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేన , ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan ) పైన సంజయ్ స్పందిస్తారా ? అలాగే వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.







