సాధారణంగా ఆంజనేయ స్వామిని భక్తులు మంగళవారం, శనివారం రోజులలో ఎక్కువగా పూజించడం జరుగుతుంది.అయితే ఒక గ్రామంలో మాత్రం భక్తులు సోమవారం రోజున హనుమంతుడిని పూజిస్తారు.
ఈ గ్రామంలోని ప్రజలు సోమవారం ఇంట్లో వంట చేయకుండా ఆలయం దగ్గర జరిగే అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ హనుమంతుడిని పూజిస్తే కోరిన కోరికలు తీరతాయని చాలామంది భావిస్తారు.
ఈ గ్రామంలో హనుమంతుడు రోక్డేశ్వర్( Hanuman is Rokdeshwar ) గా పూజలు అందుకుంటున్నారు.ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే కష్టాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయని భక్తులు నమ్ముతారు.మహారాష్ట్ర రాష్ట్రంలోని బిలోలి తాలూకా ధర్మాబాద్ ( Dharmabad )సమీపంలోని పాటోదా బీ లో ఈ ఆలయం ఉంది.500 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆలయం ఉండగా కాలక్రమంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆలయంలోని కొంత భాగం ధ్వంసమైంది.

అయితే మారుతి సోమానే( Maruti Somane ) అనే బ్రహ్మచారికి హనుమంతుడు కలలో కనిపించి గుడి గోపురాన్ని తొలగించడంతో పాటు పునాదిపైనే పునః ప్రతిష్టించి మునుపటిలా పూజలు చేయాలని కోరాడు.ఆ బ్రహ్మచారి తన కలను ఊరి పెద్దలకు చెప్పగా కలలో దేవుడు చెప్పిన విధంగా చేసి భక్తులు ఆరాధించడం మొదలుపెట్టారు.హనుమంతుడిని భక్తులు రోక్డాబా( Rokdaba ) అని పిలిచేవారు.రోక్డాబా అంటే సంపదనిచ్చే దేవుడు అనే అర్థం వస్తుంది.

సోమవారం రోజున ఈ ఊరిలో హనుమంతునికి విశేష పూజలు చేస్తారు.ఈ ఊరిలో వేప చెట్టును నరకరు.మర్రిచెట్టుకు ముడుపులు కడతారు.ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్లు, సంతానం లేని వాళ్లు, గ్రహ పీడితులు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తారు.ఈ ఆలయంలో స్త్రీ, పురుషులకు వేర్వేరు భోజనశాలలు ఉన్నాయి.రైలు, బస్సుల ద్వారా ప్రయాణం చేసి ఈ ఆలయాన్ని సులువుగా చేరుకోవచ్చు.
ఈ ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తారు.







