50 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినా కూడా ఎక్కడా అభివృద్ధి చేయని కాంగ్రెస్ </em( Congress )మరొకసారి అధికారం ఇవ్వమని మాయమాటలు చెబుతుందని, అలాంటి మాయమాటలు చెప్పే కొత్త బిచ్చగాళ్లను నమ్మొద్దు అంటూ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ .సూర్యాపేటలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి విచ్చేసి ఆయన అక్కడ సూర్యాపేటలో ఏర్పాటు చేసిన “ ప్రగతి నివేదన సభ” లో మాట్లాడారు.
ఇప్పుడు అవకాశాలు అడుగుతున్న వారు ఒకప్పుడు మంత్రులుగా పని చేశారని వారు నల్గొండకు సూర్యాపేటకు ఏం చేశారని కేసీఆర్ ( CM kcr )ప్రశ్నించారు.తమ వ్యక్తిగత లాభం తప్ప ప్రజల సంక్షేమం కాంగ్రెస్ నాయకులకు ,భాజపా( BJP party ) నాయకులకు పట్టమంటూ ఆయన విమర్శలు చేశారు.సంక్షేమ పథకాలను అంచెలంచలుగా పెంచుకుంటూ వెళ్తున్నామని త్వరలోనే పింఛన్లు కూడా పెంచుతామంటూ ఆయన చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ హామీ ఇస్తున్న 4000 పెన్షన్ పథకం కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించిన ఆయన వారివి కేవలం మాయమాటలు అంటూ ఆయన కొట్టి పడేశారు.
ఒక నాయకుడు మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడు.మరొక నాయకుడు మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందంటాడు.24 గంటల ఉచిత కరెంటుతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన బారాసా కు మరొక అవకాశం ఇవ్వాలని కేసిఆర్ కోరారు.ఈరోజు జిల్లాకొ మెడికల్ కాలేజీ కట్టుకుంటూ ముందుకు వెళుతున్న మనం దేశ తలసరి ఆదాయంలో అగ్రభాగాన ఉన్నామని మానవాభివృద్ధి సంక్షేమ సూచిక లలో కూడా తెలంగాణ కీలకమైన స్థానంలో ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు ఆర్థిక వ్యత్యాశలే కాకుండా సాంఘిక వ్యత్యాసాలు కూడా సమాజంలో అంతర్దానం అవ్వాలని తాను కోరుకుంటున్నాను అని తెలంగాణను సర్వతో ముఖాభివృద్ధి దిశ గా అభివృద్ది చేసే వరకు తాను విశ్రమించిను అంటూ కేసిఆర్ చెప్పుకొచ్చారు .రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎంపికపై కసరత్తులు చేస్తూ లోటుపాట్లను సరి చేసుకుంటే అధికార పార్టీ మాత్రం అన్ని సెట్ చేసుకొని ప్రచారంలో దూసుకుపోతుండటం విశేషం.