సాధారణంగా ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడటం తప్పనిసరి.అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తుంటారు.
టీచర్లు కూడా చిన్న పిల్లలకు స్కూల్‌లో ఇంగ్లీషు మాత్రమే మాట్లాడాలని నిబంధనలు పెడుతుంటారు.దాంతో స్టూడెంట్స్ ఇంగ్లీషులో మాట్లాడుతూ క్రమక్రమంగా అందులో ప్రావీణ్యం సాధిస్తారు.
అయితే తాజాగా ఇద్దరూ బుడ్డోళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడలేక నానా తిప్పలు పడ్డారు.వారు ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకునేందుకు టీచర్ ముందుకు వచ్చారు.
ఇంగ్లీష్‌లోనే ఏం జరిగిందో చెప్పేందుకు ప్రయత్నించారు.కానీ ఆ విషయాన్ని ఇంగ్లీషులో ఎలా చెప్పాలో తెలియక సైగలు చేసుకుంటూ ఒకరికొకరు వచ్చీరాని భాష మాట్లాడారు.

ఇదంతా చూస్తున్న టీచర్‌కి నవ్వు ఆగలేదు.వెంటనే అతను మొబైల్ ఫోన్ తీసుకొని ఈ దృశ్యాలను తన కెమెరాలో రికార్డు చేశారు.అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.వివరాల్లోకి వెళ్తే.అస్సాంలోని పచిమ్ నగామ్( Pachim Nagam in Assam ) విలేజ్‌లో ‘న్యూ లైఫ్ హైస్కూల్’( New Life High School ) ఉంది.ఇందులో స్టూడెంట్స్ తప్పనిసరిగా ఇంగ్లీష్‌లో మాట్లాడాలనే ఒక రూల్ అమలు చేస్తున్నారు.
అయితే ఇటీవల ఇద్దరు ప్రైమరీ క్లాస్ స్టూడెంట్స్ కొట్టుకున్నారు.ఈ విషయం టీచర్ దృష్టికి వచ్చింది.
దాంతో వారిని పిలిపించి అసలు ఏం జరిగింది, ఎందుకు కొట్టుకున్నారు? అని ఒక క్లాస్ టీచర్ అడిగారు.

ఆ తర్వాత ఈ బుడ్డోళ్ళు తమ ఇంగ్లీష్ నాలెడ్జ్ అంత ఉపయోగించి ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నించారు.ఒక స్టూడెంట్ మాట్లాడుతూ ఫైటింగ్, నో, సార్ అనే ఒక వర్డ్స్ తప్ప మిగతాదంతా సైగ చేస్తూ చెప్పాడు.ఎలాగోలా ‘ఇతడు నా మెడ పట్టుకున్నాడు’ అని టీచర్‌కి అర్థమయ్యేటట్లు చెప్పాడు.
తర్వాత ఇంకొక స్టూడెంట్ ‘ఇతను నా తలపై పంచు ఇచ్చాడు, సార్’ అని చెప్పడానికి కాస్త కూస్తో ఇంగ్లీష్ భాష ఉపయోగించాడు.ఆ తర్వాత సైగ చేస్తూ చెప్పాడు.
వీరిద్దరూ చాలా అమాయకంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాడారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
న్యూ లైఫ్ హై స్కూల్ ఫేస్‌బుక్ అకౌంట్ షేర్ చేసిన ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.







