సాధారణంగా హిట్ సినిమా టైటిల్స్ ను రిపీట్ చేయడానికి దర్శకనిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపరు.అప్పటికే హిట్టైన సినిమా టైటిల్ ను తమ సినిమాకు పెడితే నెగిటివ్ కామెంట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందని చాలామంది భావిస్తారు.
అయితే ఖుషి మూవీ( Kushi Movie ) విషయంలో మాత్రం మేకర్స్ రిస్క్ చేశారు.సెప్టెంబర్ నెల 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.
ఖుషి ఆంధ్ర హక్కులు ఏకంగా 22 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.

విజయ్ దేవరకొండ, సమంత( Samantha ) కెరీర్ లో ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి.సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఖుషి మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు అంచనాలను మించి విజయం సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.మైత్రీ రెగ్యులర్ బయ్యర్లు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే రిలీజైన ఖుషి ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఖుషి ట్రైలర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ( Love Story ) అనే అభిప్రాయాన్ని కలిగించడంలో సక్సెస్ అయింది.
ఖుషి సినిమాలోని పాటలు సైతం వేరే లెవెల్ లో ఉన్నాయనే సంగతి తెలిసిందే.సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఖుషి రేంజ్ వేరే లెవెల్ లో ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సమంత విదేశాలకు వెళ్లడంతో ఈ సినిమా ప్రమోషన్స్ భారమంతా విజయ్ దేవరకొండ( Vijay Deverakonda )పై ఉంది.

ఖుషి సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.లవ్ ఫ్యామిలీ జానర్ లో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
ఖుషి సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.







