విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన తాజా చిత్రం ఖుషి( Kushi ).ఈ సినిమాకు శివ నిర్మాణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసారు మూవీ మేకర్స్.ఇది ఇలా ఉంటే ఈ సినిమా సక్సెస్ అవ్వడం అటు సమంత, ఇటు విజయ్ అలాగే డైరెక్టర్ శివ నిర్వాణ( Director Shiva Nirvana )కు కూడా చాలా ముఖ్యం.
ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఈ ముగ్గురికి ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు పోస్టర్లు టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని విజయ్ అభిమానులు సమంత అభిమానులు( Samantha Fans ) ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఈ ముగ్గురు రెమ్యూనరేషన్ లకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఆ వివరాల్లోకి వెళితే.కాగా హీరో విజయ్ దేవరకొండ( Hero Vijay Deverakonda ) ఖుషి సినిమాకు 23 కోట్లు తీసుకున్నాడట.
అలాగే సమంత అయితే నాలుగున్నర కోట్లు తీసుకుందట.

ఇక డైరెక్టర్ శివ నిర్వాణ ఏకంగా పన్నెండు కోట్లు తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.దాంతో జనాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.వాళ్లకి అన్ని కోట్లు ఇస్తున్నారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు.ముఖ్యంగా డైరెక్టర్ శివ నిర్వాణకు అంత రెమ్యూనరేషన్( Director Shiva Nirvana Remuneration ) ఇచ్చే సీన్ ఉందా? అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.విజయ్ కి సమంతకి చాలా ఓవర్ గా రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.
అలాగే శివ నిర్వాణకి సైతం పన్నెండు కోట్లు అంటే నమ్మశక్యంగా లేదని మాట్లాడుకుంటున్నారు.కేవలం వీరి ముగ్గురు రెమ్యూనరేషన్ లకే 40 కోట్లు ఖర్చు అయితే సినిమాకు ఎంత అయి ఉంటుంది.
అవన్నీ రికవరీ చేయాలంటే ఎంత కలెక్ట్ చేయాల్సి ఉంటుందని జనాలు చర్చించుకుంటున్నారు.మొత్తానికి సోషల్ మీడియాలో ఈ ముగ్గురు రెమ్యూనరేషన్ లపై జోరుగానే చర్చలు కొనసాగుతున్నాయి.







