ఆస్తిపాస్తులు ఉండి కాస్త అమాయకంగా కనిపిస్తే మాయ మాటలు చెప్పి అడ్డంగా మోసం చేసేవారు మన చుట్టూనే ఉంటారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఇటీవలే కాలంలో ఒంటరిగా, నిజాయితీగా తమ బతుకు తాము బతుకుదాం అనుకుంటే .? సమాజంలో ఉండే చీడపీడలు పట్టిపీడిస్తాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఓ వృద్దిరాలికి బీమా చేస్తామని పరిచయం చేసుకొని, తరువాత ఇంటికి వాస్తు సరిగా లేదని ఇంటిని విక్రయించి రూ.3.5 కోట్లు కాజేసిన ఘరానా ముఠాను గురువారం కర్ణాటక( Karnataka )లోని బనశంకరి పోలీసులు అరెస్టు చేశారు.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

వివరాల్లోకెళితే.బెంగుళూరు( Bangalore ) లోని బనశంకరి పద్మనాభ నగర నివాసి శాంత (63), ఆమె కూతురుతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది.2021లో రాకేష్, అరుంధతి అనే వ్యక్తులు ఈ శాంతను కలిసి ఇన్సూరెన్స్ పాలసీ చేపించుకుంటారా అని అడిగారు.నెమ్మదిగా ఈ వృద్ధురాలితో పరిచయం పెంచుకొని పద్మనాభ నగరలో ఉండే ఇంటి సమాచారం మొత్తం తెలుసుకున్నారు.ఇంటికి వాస్తు సక్రమంగా లేదని మాయ మాటలు చెప్పి ఆ ఇంటిని అమ్మేద్దామని ఆ వృద్ధురాలిని ఒప్పించారు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్లను( Real Estate Brokers ) తీసుకువచ్చి సుమారు రూ.4.5 కోట్లకు ఇంటిని అమ్మేసి, ఆ మొత్తం నగదును శాంత బ్యాంక్ ఖాతాలో జమ చేశారు.ఇక శాంత వీరిని పూర్తిగా నమ్మిన తర్వాత షేర్ మార్కెట్లో( Share Market Investment ) పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మించారు.

కత్రి గుప్పెలోని కెనరా బ్యాంకులో ఉన్న రూ.1.90 కోట్లతో ఉండే రెండు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను( Fixed Deposit Accounts ) క్లోజ్ చేయించారు.ఆ సమయంలో శాంత నుంచి ఆరు చెక్కులపై అలాగే కొన్ని ఖాళీ ఫారాలపై సంతకాలు చేయించుకున్నారు.2023 మే 16 నుంచి జూన్ 26 మధ్యలో చెక్కులను అదే బ్యాంకులో ఇచ్చి రూ.3.5 కోట్లను ఆర్.సంజీవప్ప, ఆర్.పరిమళ, విశాల అనే బ్యాంక్ అకౌంట్లోకి నగదు జమ చేయించుకున్నారు.తాజాగా శాంత తన బ్యాంకు ఖాతాలను పరిశీలించగా అందులో నగదు లేకపోవడంతో తాను మోస పోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.