శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.ఈ క్రమంలో కదిరి పట్టణంలోని నల్లకుంట సమీపంలో రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి.
కుక్కలు దాడికి పాల్పడుతున్న నేపథ్యంలో పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు తీవ్రంగా జంకుతున్నారు.కుక్కల గురించి మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద తప్పించాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.గత రెండు నెలల క్రితం వీధిలోని రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారులపై కుక్కలు దాడి చేసి గాయపర్చిన సంగతి తెలిసిందే.







