Hariteja: బిగ్ బాస్ లో ఆ మాటలు.. ఇక్కడ ఈ చేష్టలు.. హరితేజ తీరుపై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?

సెలబ్రెటీలు మాట తప్పితే చాలు వెంటనే జనాలు వారిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తుంటారు.అంతేకాకుండా ప్రతిసారి వారి దగ్గర అదే విషయాన్ని తీస్తూ ఉంటారు.

 The Netizens Are Trolling Bigg Boss Hariteja-TeluguStop.com

అయితే ఇప్పటికి కొంత మంది సెలబ్రెటీలు వ్యక్తిగత విషయంలో చాలా సార్లు మాట మారుస్తూ వచ్చారు.అయితే హరితేజ( Hariteja ) కూడా మాట మార్చడంతో జనాలు తనను టార్గెట్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకు అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.బుల్లితెర, వెండితెర ఆర్టిస్ట్ హరితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

నటిగా టాలీవుడ్( Tollywood ) లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.తొలిసారిగా ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.

ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుంది.బుల్లితెరకు మనసు మమత సీరియల్ తో ఎంట్రీ ఇవ్వగా.

ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.

అంతేకాకుండా బుల్లితెర లో పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది.

తర్వాత 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో( Bigg Boss reality show ) మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.

బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది హరితేజ.ఇక మంచి ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన సమయంలో పెళ్లి చేసుకోగా.

ఒక పాపకు జన్మనిచ్చింది.ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది హరితేజ.

సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.

అప్పుడప్పుడు తను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది.ఇక తన భర్త తో చేసే రీల్స్ కూడా షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.

Telugu Bigg Boss, Hariteja, Shared-Movie

అయితే కొన్ని రోజుల నుండి ఈమె మొత్తం స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది. ట్రెడిషనల్ డ్రెస్సెస్ కాకుండా మొత్తం పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.ఇతరులు ఏమనుకున్నా కూడా పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు రెడీ అవుతుంది.ఇక భర్త నుండి కూడా పూర్తి సపోర్ట్ ఉండటంతో అస్సలు ఆగట్లేదు హరితేజ.ఇక తన సిస్టర్ తో కలిసి బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.అయితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకోగా అందులో కూడా తను పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నట్లు కనిపించింది.

Telugu Bigg Boss, Hariteja, Shared-Movie

ఇక ఈమె ఫోటోలు చూసి జనాలు బాగా ట్రోల్స్ చేస్తున్నారు.కొంతమంది గతంలో ఈమె అన్న మాటలు తలుచుకొని మరి ట్రోల్ చేస్తున్నారు.బిగ్బాస్ లో ఏదో అన్నట్టు గుర్తు.నాకు ఇలాంటి డ్రెస్సులు నచ్చవు అని అన్నట్టు గుర్తు.అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా మరో నెటిజన్.నాకు బాగా గుర్తుంది.

బిగ్బాస్ లో ఫేర్వెల్ రీ యూనియన్ టైంలో హరితేజ కి కొంచెం షార్ట్ డ్రెస్ ఇచ్చారు.అప్పుడు అది చూసి ఇలాంటివి ఎప్పుడు వేసుకోలేదు.

వేసుకోవాలనిపించదు.అని అన్నది.

ఇప్పుడు థైస్ కనపడేలా వేస్తుంది అని ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube