టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ( Kartikeya Gummakonda ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ భారీగా ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కార్తికేయ.
కార్తికేయ తాజాగా నటించిన చిత్రం బెదురులంక 2012.( Bedurulanka 2012 ) ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానున్న లో విషయం తెలిసిందే.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.ఇది ఇలా ఉంటే ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
గత నాలుగు ఐదు రోజులుగా హీరో చిరంజీవి పై వస్తున్న విమర్శలపై స్పందించారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) తాజాగా విడుదల ఈ ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసిన విషయం తెలిసిందే.దీంతో చిత్ర బృందంపై హీరో చిరంజీవి పై( Chiranjeevi ) భారీగా విమర్శలు గుప్పిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ఆ నెగిటివ్ కామెంట్స్ పై స్పందించిన కార్తికేయ.
ఒక సినిమా బాగోలేదు, నచ్చలేదు అని అనడంలో ఎవరికి ఇబ్బంది ఉండదు.కాని అలా కాకుండా ఒక వ్యక్తిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ మాటలు అంటుంటే బాధ అనిపిస్తుంది.
ఆయన్ని అలా అనేవారిని చూస్తుంటే వారిది చిన్న మనస్తత్వం ఏమో అని అనిపిస్తుంది.ఒక్క చిరంజీవి గారినే కాదు, అలా ఏ నటుడిని అనడం సరికాదు.

అయినా ఒక సినిమా ఆడకపోతే అది నేరమా? అని ప్రశ్నించాడు.చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో కష్టమైన ఒడిదొడుకులు ఎదురుకొని ఉంటారని, ఇలాంటి చిన్న చిన్న వాటికీ ఆయన ఫీలవ్వకుండా ముందుకు సాగుతారని తాను భావిస్తున్నట్లు కార్తికేయ చెప్పుకొచ్చారు.ఈ సందర్బంగా కార్తికేయ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా తాజాగా బెదురులంక సినిమా ట్రైలర్ ని రామ్ చరణ్( Ram Charan ) చేతులు మీదుగా రిలీజ్ చేయించిన కార్తికేయ తన సూపర్ హిట్ మూవీ ఆర్ఎక్స్ 100 ట్రైలర్ ని కూడా చరణే రిలీజ్ చేసినట్లు గుర్తు చేశాడు.







