ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి పొజిషన్ లో కొనసాగుతున్న మెగా ఫ్యామిలీ ఈ స్థాయిలో ఉండడానికి కారణం చిరంజీవి ( Chiranjeevi ) అని చెప్పుకుంటారు.అంతే కాదు చిరంజీవి వల్లే ఆయన ఫ్యామిలీ నుండి ఇంతమంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఒకవేళ ఆయన గనక లేకపోతే ఇండస్ట్రీకి మెగా ఫ్యామిలీ ( Mega family ) లోని టాలెంట్ గా ఉన్న హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యేవారు కాదు.అయితే చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే అలవోకగా చేసేవారు.
సెకండ్ హీరోగా.విలన్ గా.చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ ఇండస్ట్రీలో ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారు.

ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఈయన లాంటి పొజిషన్ కి రావాలంటే చాలా కష్టం.అది కేవలం చిరంజీవి ( Chiranjeevi ) కి మాత్రమే సొంతమైన రికార్డు.అయితే అలాంటి చిరంజీవి చాలా మందికి సినిమాల్లోకి రాకముందు ఏ పని చేసేవారో తెలియదు.
మరి చిరంజీవి సినిమాల్లో హీరో కాక ముందు ఏ పని చేశారో ఇప్పుడు తెలుసుకుందామా.చిరంజీవి చదువుకునే రోజుల్లో నుండే సినిమాల్లోకి రావాలని ఒక కోరిక ఉండేది.
దాంతో తన తండ్రిని ఒప్పించి మద్రాస్ కి వచ్చి నటనలో శిక్షణ తీసుకొని ఎవరు అవకాశం ఇస్తారా అని సినిమా ఆఫీసులో చుట్టూ కాళ్ళరిగేలా తిరిగేవారు.ఇక అలాంటి టైంలో చిన్న చిన్న పాత్రలతో పాటు ఒక సీరియల్ లో గెస్ట్ గా చేసే అవకాశం వచ్చిందట.
అదే బాలీవుడ్ లోని రజని ( Rajani ) అనే సీరియల్.ఇది అప్పట్లో దూరదర్శన్ లో ప్రసారమయ్యేది.

ఇక ఈ సీరియల్ లో చిరంజీవి ( Chiranjeevi ) అతిథి పాత్రలో కేవలం ఒక ఎపిసోడ్లో మాత్రమే కనిపించారు.అయితే ఆ తర్వాత కూడా ఈయన ఆ సీరియల్ లో కనిపించాల్సి ఉండగా ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చి బిజీ అవ్వడం వల్ల మళ్లీ ఆ సీరియల్లో నటించలేదు.ఇలా సినిమాల్లోకి రాకముందే చిరంజీవి రజిని అనే సీరియల్ లో గెస్ట్ పాత్రలో నటించారనే సంగతి చాలా మందికి తెలియదు.