మెగా ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ రాబోతోందా... వరుణ్ మాటలకు అర్థం అదేనా?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ ( Gandeevadhari Arjuna ) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా ఈనెల 25వ తేదీ విడుదల కానుంది.

 Hero Varun Tej About Mega Heroes Multistarrer Movies,varun Tej,multistarer Movie-TeluguStop.com

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్( Varun Tej ) పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు మెగా ఫ్యామిలీ సినిమాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

Telugu Acharya, Bro, Multier, Varun-Movie

ఈ సందర్భంగా యాంకర్ వరుణ్ తేజ్ ను ప్రశ్నిస్తూ మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా ఏవైనా మల్టీ స్టారర్ సినిమాలు ( Multistarer Movies )వచ్చే అవకాశాలు ఉన్నాయా అని ప్రశ్నించడంతో మంచి కథ వస్తే తప్పకుండా మల్టీ స్టారర్ సినిమాలు వస్తాయని వరుణ్ తేజ్ తెలియచేశారు.దర్శకులకు ఇప్పటికే అలాంటి కథలు సిద్ధం చేసుకుని రమ్మని చెప్పామంటూ ఈ సందర్భంగా మెగా హీరోల మల్టీ స్టారర్ సినిమాల( Mega Heroes Multi Starrer ) గురించి మాట్లాడుతూ ఇలాంటి కామెంట్స్ చేశారు.సరైన కథ దొరికితే మల్టీ స్టార్ సినిమాలలో చేయడానికి తాము కూడా సిద్ధంగానే ఉన్నామని వరుణ్ వెల్లడించారు.

Telugu Acharya, Bro, Multier, Varun-Movie

ఇప్పటికే చిరంజీవి రాంచరణ్ ఇద్దరు కలిసి ఆచార్య( Acharya ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.కొరటాల శివ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ సినిమాగా బ్రో చిత్రం( Bro Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.అయితే భవిష్యత్తులో మెగా ఫ్యామిలీ నుంచి ఇలాంటి మల్టీ స్టార్ సినిమాలు మరికొన్ని కూడా రాబోతున్నాయని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చెప్పగానే చెప్పేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube