తెలుగులో చాలా మంది నటులు ఉన్న కూడా అందరూ మలయాళం( Malayalam ) లో ఉన్న నటుల యాక్టింగ్ బాగుంటుంది అని ఎందుకు అంటుంటారు.వాళ్ళు మన హీరోల కంటే గొప్ప నటుల అంటే అదేమీ కాదు కానీ మరీ వాళ్ళు ఎందుకు అవార్డ్ లు గెలుచుకున్నారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం.

అప్పట్లో తెలుగు లో డిఫరెంట్ సినిమాలు తీస్తే జనాలు ఎక్కువ గా చూసేవారు కాదు.అందుకనే మన మేకర్స్ కమర్షియల్ సినిమాలు( Commercial films ) చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు…కానీ మలయాళం లో ఉన్న నటులు డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తారు కాబట్టి వాళ్ల లోని నటులు బయటికి వచ్చి ప్రేక్షకులకి కొత్త నటులను చూస్తున్నట్టు గా ఫీలింగ్ కల్గుతుంది ఇక దాంతో అక్కడ జనాలు సినిమాలు ఎక్కువ గా చూసి ఆ సినిమాని హిట్ చేస్తారు అలాగే వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తారు.

ఇక అక్కడ వాళ్ల పరిస్థితి అలా ఉంటే ఇక్కడ మన వాళ్ల పరిస్థితి మరోలా ఉంది…ఒకప్పుడు డిఫరెంట్ సినిమాలు తీస్తే ఎవరు చూడరు అందుకే మన హీరోలు కూడా మొదటి నుంచి కమర్షియల్ సినిమాలు తీయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు.అందుకే ఇక్కడ మంచి సినిమాలు రావడం ఆగిపోయాయి కాని ఇప్పుడిప్పుడు ఇక్కడ కూడా మంచి సినిమాలు వస్తున్నాయి జనాలు కూడా ఆదరిస్తున్నారు దాంతో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు( Directors , producers ) కూడా రిస్క్ చేసి మరీ సినిమాలు చేస్తున్నారు సక్సెస్ లు అందుకుంటున్నారు… ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాట కి ఆస్కార్ అవార్డ్ రావడం రామ్ చరణ్ గ్లోబల్ హీరో గా పేరు దక్కించుకోవడం తో మన ఇండస్ట్రీ లో ఉన్న నటులు కూడా యాక్టింగ్ లో ఎవ్వరికీ తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకున్నారు.








