బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జవాన్”.( Jawan Movie ) ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ ప్రేక్షకులు ఇటు కోలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.
షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ”జవాన్”.ఈ సినిమా హిందీలో మాత్రమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది.
ఇటీవలేషారుఖ్ ‘ పఠాన్’ సినిమా( Pathaan Movie )తో ఒక దశాబ్దం తర్వాత హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతో ఈయన హిట్ అందుకోవడమే కాకుండా మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీకే పూర్వవైభవం తీసుకు వచ్చాడు.
మరి ఈ హిట్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ ప్రజెంట్ ఫుల్ జోష్ తో జవాన్ సినిమాను పూర్తి చేస్తున్నాడు.అందుకే ఈయన ఫ్యాన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు…

ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా పెద్ద ఎత్తున ఉండడంతో హిందీతో పాటు తమిళ్ ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.దీపికా పదుకొనే( Deepika Padukone ) విజయ్ సేతుపతి, ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా వంటి వారు కీ రోల్స్ పోషిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఒక్కో ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతూనే ఉంది.తాజాగా ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాకు షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
షారుఖ్ గత సినిమా పఠాన్ హైయెస్ట్ బడ్జెట్ కాగా దానికి మించి ఖర్చు చేసినట్టు టాక్.ఏకంగా ఈ సినిమా కోసం 300 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తుంది.
ఇదే ఈయన కెరీర్ లో హైయెస్ట్ అని చెప్పాలి.







