'స్వయంభు' నుండి క్రేజీ పోస్టర్.. వారియర్ గా నిఖిల్.. లుక్ అదిరింది!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ( Nikhil Siddhartha )కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది.చిన్న హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన నిఖిల్ ఈ రోజు పాన్ ఇండియన్ హీరోగా సత్తా చాటుతున్నాడు.

 Exciting Poster On Nikhil Siddhartha's Swayambhu, Nikhil Siddhartha, Swayambh-TeluguStop.com

కార్తికేయ 2 సినిమా( Karthikeya 2 ( నిఖిల్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా కూడా హిట్ అవ్వడంతో ఈయనకు మంచి పేరు వచ్చింది.

Telugu Anupam Kher, Posternikhil, Karthikeya, Samyuktha Menon, Swayambhu, Tollyw

ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ కూడా మంచి విజయం సాదించింది.దీంతో ఈ కుర్రహీరోతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు భారీగా పోటీ పడుతున్నారు.ఇటీవలే స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ కాకపోయినా పర్వాలేదు అనిపించు కున్నాడు.ఇక ఇప్పుడు ”స్వయంభు”( Swayambhu ) అనే మరో సినిమాను స్టార్ట్ చేసాడు.

ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు…

నిఖిల్ ఈ సినిమాలో మునుపెన్నడూ చేయని రోల్ లో నటిస్తున్నాడు.యువ యోధుడిని వర్ణించే పురాణ ఫాంటసీ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా నిఖిల్ వారియర్ గా ప్రజెంట్ చేస్తూ గుర్రం మీద బాణం వేస్తున్నట్టుగా ఉన్న లుక్ ను రిలీజ్ చేసారు.

లుక్ లో నిఖిల్ పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.అంతేకాదు ఈ పోస్టర్ తోనే షూటింగ్ బిగిన్స్ అంటూ కన్ఫర్మ్ చేసారు…

Telugu Anupam Kher, Posternikhil, Karthikeya, Samyuktha Menon, Swayambhu, Tollyw

ఇక ఈ సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు.నిఖిల్ సరసన సంయుక్త మీనన్( Samyuktha Menon ) హీరోయిన్ గా ఎంపిక అయ్యినట్టు తెలుస్తుంది.మరి నిఖిల్ కొత్త ప్రయోగాలలో ఇది ఒకటి కావడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టు కుంటుందో చూడాలి.

ఇక దీంతో పాటు నిఖిల్ హీరోగా ‘ది ఇండియా హౌస్’ పేరుతో రామ్ చరణ్ నిర్మాతగా వి మెగా పిక్చర్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube