ప్రజలకు సేవ చేసే నాయకత్వం కావాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.కొన్ని పార్టీలు ఎన్నికల సమయంలోనే బయటకు వస్తాయని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 72 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులను బాగా అభివృద్ధి చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ఎన్నికలకు ముందు మాత్రమే వచ్చే పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.ఈ క్రమంలోనే ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని వెల్లడించారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







