ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.జాతీయ, రాష్ట్ర నాయకుల విగ్రహాల తొలగింపుపై టీడీపీ నేతలు నిరసనకు దిగారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే సౌమ్య యత్నించారు.ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో మాజీ ఎమ్మెల్యేకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.తరువాత నల్లజెండాలతో రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
వైఎస్ఆర్ విగ్రహం తొలగించకుండా మిగిలిన విగ్రహాలు తొలగించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు నందిగామకు వెళ్లకుండా టీడీపీ నేత దేవినేని ఉమను అడ్డుకున్న పోలీసులు గొల్లపూడిలో హౌస్ అరెస్ట్ చేశారు.